Breaking News

అమెరికాలో మంచు బీభత్సం 

Published on Tue, 02/24/2026 - 06:09

న్యూయార్క్‌: అమెరికా ఈశాన్య ప్రాంతాలపై భీకర మంచు తుపాను విరుచుకుపడింది. న్యూయార్క్‌ నగరం మొదలు మసాచుసెట్స్‌ దాకా సోమవారం తెల్లవారుజామున గంటకు 7.6 సెంటీమీటర్ల ఎత్తులో మంచును కురిపిస్తూ శీతాకాల తుపాను భీకరంగా విరుచుకుపడింది. దీంతో రోడ్లు, ఇళ్లు, దుకాణాలు, పార్క్‌లు, మైదానాలు ఇలా ఎక్కడ చూసినా అంతెత్తున మంచు పేరుకుపోయింది. మంచు, చలిగాలుల ధాటికి వాహనాల్లో ప్రయాణాలపై అధికారులు నిషేధం విధించారు. 

అత్యవసరంకాని పనులు కోసం ఎవరూ ఎక్కడికి వెళ్లొద్దని జాతీయ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జనసమ్మర్ధ న్యూయార్క్‌ నగరంలో జనం ఎటూ పోలేక లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నార్త్‌ కరోలినా మొదలు ఉత్తర మెయిన్‌ ప్రాంతందాకా పెను తుపాను హెచ్చరికలు జారీచేశారు. అమెరికాకు రాకపోకలు సాగించాల్సిన 5,000 విమాన సరీ్వసులు సోమవారం రద్దయ్యాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్‌ పరిధిలో ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. 

అంధకారంలో లక్షలాది కుటుంబాలు... 
మంచు సంబంధ కారణాలతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది అంధకారంలో ఉండిపోయారు. ఈ స్థాయిలో న్యూయార్క్‌ నగరాన్ని మంచు తుపాను చుట్టుముట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి. న్యూజెన్సీ రాష్ట్రంలో 1996 తర్వాత ఇంతటి స్థాయిలో మంచు కురవడం ఇదే మొదటిసారి. ‘‘మా ఇంటి ముందున్న చెట్లు మంచు భారీగా కురవడంతో బరువుకు బలహీనమయ్యాయి. వీటికి తోడు భీకర చలిగాలుల ధాటికి అవి నేలకూలాయి’’అని మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌ ప్రాంతవాసి మేరీ షైఫిలే చెప్పారు. సోమవారం విద్యాలయాలన్నీ మూతబడి ఆన్‌లైన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాయి.

 ప్రజల భద్రత నిమిత్తం రవాణాపై నిషేధం కొనసాగిస్తున్నామని న్యూజెర్సీ మహిళా గవర్నర్‌ మైకీ షెరిల్‌ చెప్పారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను ఆదివారం రాత్రే 46 సెంటీమీటర్ల మేర మంచు దుప్పటి కప్పేసింది. న్యూజెర్సీలోని ఫ్రీహోల్డ్‌ ప్రాంతంలో 55 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. రోడ్‌ ఐలాంలోని ఇస్లిప్‌ ప్రాంతంలో ఏకంగా 57 సెంటీమీటర్ల ఎత్తుదాకా మంచు పడింది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత సెంట్రల్‌ పార్క్‌(39 సెం.మీ.ల మంచు), జాన్‌ ఎఫ్‌.కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం(38 సెం.మీ.ల మంచు), లాంగ్‌ ఐస్‌లాండ్‌ మ్యాక్‌ఆర్థిర్‌ ఎయిర్‌పోర్ట్‌(57 సెం.మీ.ల మంచు) సైతం మంచు గుప్పిట్లో చిక్కుకుపోయాయి.

చలిపులికి బలికాకండి... 
మరి కొద్దిరోజులపాటు ఈ మంచు తుపాను విశ్వరూపం చూపించే ప్రమాదముందని నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫిరిక్‌ అడ్మిని్రస్టేషన్‌ సోమవారం ప్రకటించింది. గంటలకు 112 కిలోమీటర్ల వేగంతో అతి చలి గాలులు వీస్తున్నాయి. న్యూయార్క్, డెలావర్, మసాచుసెట్స్, న్యూజెర్సీ, కనెక్టికట్, రోడ్‌ ఐలాండ్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో అత్యయిక స్థితిని ప్రకటించారు. అనవసరంగా బయటికొచ్చి చలిపులికి బలికావొద్దని న్యూయార్క్‌ నగర మేయర్‌ జోహ్రాన్‌ మామ్దానీ సిటీ పౌరులను వేడుకున్నారు. కరెంట్‌ కట్‌ అయి తాము చీకట్లో మగ్గిపోతున్నామని న్యూజెర్సీలో 1,23,000 కుటుంబాలు, మసాచుసెట్స్‌లో 1,46,000 కుటుంబాలు, డెలావర్‌లో 71,000 కుటుంబాలు విద్యుత్‌ సరఫరా సంస్థకు ఫిర్యాదులుచేశాయి. 

దీంతో అట్లాంటిక్‌ సిటీ ఎలక్ట్రిక్‌ సంస్థ ఉద్యోగులు రంగంలోకి దిగారు. ‘‘మంచు కారణంగా చెట్లు కూలడంతో పాడైన విద్యుత్‌ స్తంభాలు, యూటిలిటీ పోల్స్‌ను బాగుచేయడం మా తరం కాదు. అదనపు సిబ్బంది పొరుగు ప్రాంతాల నుంచి రప్పించాల్సిందే. లేదంటే ఆయా ఇళ్లల్లో విద్యుత్‌ వెలుగులు కష్టమే. పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే మరికొన్ని రోజులు పట్టొచ్చు’’అంటూ విద్యుత్‌ సిబ్బంది చేతులెత్తేశారు. వీధుల్లో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు స్నో మేనేజ్‌మెంట్‌ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ‘‘ఏకధాటిగా 36 గంటలపాటు పనిచేస్తున్నాం. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ మంచు తొలగింపు పనిలో మునిగిపోయాం’’అని జాన్‌ బెర్లింగెరీ చెప్పారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)