Breaking News

Houthi Attacks: హౌతీ గ్రూపు మాస్‌ వార్నింగ్‌..

Published on Sat, 01/06/2024 - 08:28

టెహ్రాన్‌: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణపై అమెరికా ఏర్పాటు చేసిన కూటమిలో భాగస్వామ్య దేశాలంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్‌ గ్రూపు హెచ్చరించింది. కూటమి దేశాలన్నీ ఎర్ర సముద్రంలో తమ నౌకల భద్రతను కోల్పోవాల్సి వస్తుందని హౌతీ గ్రూపు సుప్రీం రివల్యూషనరీ కమిటీ సీనియర్‌ అధికారి మహ్మద్‌ అలీ అల్‌ హౌతీ తాజాగా  బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నింగ్‌ ఇచ్చాడు.

తాము దాడులను పూర్తిగా ఆపే వరకు కూటమి దేశాల నౌకలకు ముప్పు తప్పదని స్పష్టం చేశాడు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్‌ జరుపుతున్న దాడులను ఎదుర్కొనేందుకు 12 దేశాలతో కలిసి అమెరికా ఒక కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో యూకే,ఆస్ట్రేలియా జపాన్‌​ తదితర దేశాలున్నాయి. అయితే ఈ కూటమిలో తాము లేమని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. 

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా తూర్పు, పశ్చిమ దేశాల సముద్ర రవాణాకు కీలకమైన ఎర్ర సముద్రంలోని బాబ్‌ ఎల్‌ మండెబ్‌ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై హౌతీలు డ్రోన్‌లతో ఇటీవల దాడులు చేస్తున్నారు. హౌతీల దాడులు మొదలైన తర్వాత ఈ రూట్‌లో భారత షిప్పింగ్‌ కంపెనీలు తమ నౌకల రవాణాను  రద్దు   చేసుకుని భారీ ఖర్చుతో కూడిన ఆఫ్రికా రూట్‌లో నౌకలను పంపుతున్నాయి.ఈ రూట్‌లో ఇండియా నుంచి నౌకలు అమెరికా, యూరప్‌లను చేరుకోవడానికి 14 రోజులు ఎక్కువ సమయం పడుతోంది.    

ఇదీచదవండి..ట్రంప్‌ పై బ్యాన్‌.. రివ్యూకు సుప్రీం కోర్టు ఓకే  

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)