Breaking News

అమెరికాకు షాక్‌.. డ్రోన్‌ను కూల్చేసిన ‘హౌతీ’లు

Published on Sun, 09/08/2024 - 12:34

సనా: అమెరికాకు చెందిన అత్యాధునిక  నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్లు యెమెన్‌ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్‌ గ్రూపు హౌతీ రెబెల్స్‌ ప్రకటించారు. యెమెన్‌ గగనతలంలో ఎగురుతున్న ఎమ్‌క్యూ-9 మానవరహిత విమానాన్ని(యూఏవీ) కూల్చేసినట్లు హౌతీల ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. హౌతీ నియంత్రణలోని యెమెన్‌ భూభాగంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు.

2014లో యెమెన్‌ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన పలు డ్రోన్లు, నిఘా విమానాలను రెబెల్స్‌ కూల్చేశారు. ‘మారిబ్‌ గవర్నరేట్‌ గగనతలంలో రీపర్‌ శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోంది. అందుకే దానాని కూల్చేశాం. పాలస్తీనా ప్రజలు, యెమెన్‌ రక్షణ కోసం హౌతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారు’అని సారీ చెప్పారు.

ఎమ్‌క్యూ-9 రీపర్‌ డ్రోన్‌.. ఎన్నో ప్రత్యేకతలు..

అమెరికా నిఘా డ్రోన్‌ ఎమ్‌క్యూ-9 విమానాన్ని పోలి ఉంటుంది. దీన్ని రిమోట్‌తో ఆపరేట్‌ చేస్తారు. పైలట్‌లు ఉండరు. సాధారణ డ్రోన్‌లతో పోలిస్తే ఈ నిఘా డ్రోన్‌ చాలా ఎత్తులో ఎగరగలదు. 50 వేల అడుగుల ఎత్తులో 24 గంటలపాటు నిరంతరాయంగా ఎగురుతూ కీలక సమాచారం సేకరించే సామర్థ్యం దీని సొంతం. దీని విలువ సుమారు రూ.250కోట్లకు పైనే.

కాగా, ఇజ్రాయెల్‌- పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మధ్య జరుతున్న యుద్ధంలో హౌతీ రెబెల్స్‌ పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నారు.  ఎర్రసముద్రంలోని వాణిజ్య నౌకలు లక్ష్యంగా కొంత కాలం నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్‌ ఆఫ్  ఎడెన్‌లో ఓ వాణిజ్య నౌకపై మిసైల్‌తో దాడి చేశారు. 
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)