Breaking News

హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌ తొలి ప్రసంగం.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్‌

Published on Wed, 10/30/2024 - 21:20

షరతుల ప్రకారమైతే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణను అంగీకరిస్తామని లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా మిలిటెంట్‌ గ్రూప్‌ కొత్త చీఫ్‌ నయీమ్ ఖాస్సేమ్ అన్నారు.  ఆయన  నిన్న (మంగళవారం) హెజ్‌బొల్లాకు కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు. చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలి ప్రసంగాన్ని చేశారు. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన మాజీ హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హస్సెన్ నస్రల్లా మార్గంలో కొనసాగుతానని ప్రతిజ్ఞ చేశారు. 

‘‘ నా  యుద్ధ వ్యూహాం..  మా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లా యుద్ధ వ్యూహానికి కొనసాగింపు. లెబనాన్‌కు వ్యతిరేకంగా జియోనిస్ట్ పాలన 39 వేల ఉల్లంఘనలకు పాల్పడింది. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో స్థావరాలను నిర్మించాలని చూస్తోంది. గాజా,  లెబనాన్‌లలో ఇజ్రాయెల్ చేసిన హత్యానేరాల్లో అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ రెండూ భాగస్వామిగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్‌ను ఆక్రమించుకుని అరబ్ దేశంలో సెటిల్‌మెంట్లు చేసుకోవాలని యోచిస్తోంది. హెజ్‌బొల్లా ఇజ్రాయెల్ ఆలోచనలకు అడ్డుగా నిలుస్తోంది. 

... గత నెలల్లో బాధాకరమైన ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రస్తుతం హెబ్‌బొల్లా గ్రూప్‌ కోలుకుంటోంది. లెబనీస్ నేల నుంచి యూదుల దేశం అత్యవసరంగా ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. నష్టాలను తగ్గించుకోవడానికి మా భూమి నుంచి వెళ్లిపోండి. ఇలాగే ఉండిపోతే.. మీ జీవితంలో ఎన్నడూ చెల్లించని భారీ మూల్యం చెల్లించుకుంటారు. హెజ్‌బొల్లా రోజులు, వారాలు, నెలల పాటు పోరాటాన్ని కొనసాగించగలదు’’ అని అన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)