Breaking News

ఇజ్రాయెల్‌పై యుద్ధమే

Published on Mon, 09/23/2024 - 05:01

నహారియా (ఇజ్రాయెల్‌): ఇజ్రాయెల్‌పై ఇక యుద్ధమేనని హెజ్బొల్లా ప్రకటించింది! విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని పేర్కొంది. అన్నట్టుగానే ఇజ్రాయెల్‌పై భారీ ప్రతీకార దాడులకు దిగింది. ఆదివారం వేకువ నుంచే 100కు పైగా రాకెట్లను ఇజ్రాయెల్‌లోని సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించినట్టు హెజ్బొల్లా ఉప నాయకుడు నయీమ్‌ కస్సెమ్‌ ప్రకటించారు. ‘మేమూ మనుషులమే.

 మాకెంత బాధ కలిగించారో మీరూ అంతే స్థాయిలో బాధపడతారు’’ అని హెచ్చరించారు. శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్‌ కమాండర్‌ ఇబ్రహీం అకీల్‌ సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. ‘‘మేమేంటో యుద్ధక్షేత్రంలో రుజువు చేసుకుంటాం. మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాం. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించలేరు’ అని ఆదివారం అకీల్‌ అంత్యక్రియల సందర్భంగా ఇజ్రాయెల్‌ను నయీమ్‌ హెచ్చరించారు.

 ఇజ్రాయెల్‌ ఉత్తర భాగంలోని ప్రజలు వలసపోక తప్పదని హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఇజ్రాయెల్‌ ఉత్తర ప్రాంతం ముందస్తు సైరన్లతో మారుమోగింది. వేలాదిగా జనం బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. దాడుల్లో నలుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్‌ పేర్కొంది. హెజ్బొల్లా రాకెట్లు ఇంతకు ముందెన్నడూ ఇంత దూరం వరకు రాలేదంది. 

 హైఫాకు దగ్గర్లోని రమత్‌ డేవిడ్‌ ఎయిర్‌బేస్‌పైకి ఫాది 1, ఫాది 2 క్షిపణులను ప్రయోగించినట్లు  హెజ్బొల్లా ప్రకటించుకుంది. హెజ్బొల్లా ఈ రకం ఆయుధాలను ప్రయోగించడం ఇదే మొదటిసారి. హెజ్బొల్లా యుద్ధ ప్రకటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ స్పందించారు. ‘‘వాళ్లిప్పటికీ గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. త్వరలోనే నేర్చుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు. 

అల్‌ జజీరా కార్యాలయం మూసివేత 
ఇలా ఉండగా, ఇజ్రాయెల్‌ బలగాలు ఆదివారం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతం రమల్లాలో ఉన్న అల్‌ జజీరా శాటిలైట్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ కార్యాలయాలపై దాడులు జరిపాయి. బలగాలు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడాన్ని ఆ చానెల్‌ అరబిక్‌ విభాగం ప్రత్యక్ష ప్రసారం చేసింది. అల్‌ జజీరా కార్యాలయాలను 45రోజులపాటు మూసివేయాలని హుకుం జారీ చేసింది. అక్కడి సిబ్బందిని తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హమాస్, హెజ్బొల్లాలకు అధికార ప్రతినిధిగా అల్‌ జజీరా మారిపోయిందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)