Breaking News

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా డ్రోన్‌ దాడి.. నలుగురి సైనికులు మృతి

Published on Mon, 10/14/2024 - 07:14

ఇజ్రాయెల్‌పై  హెజ్‌బొల్లా  దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

హైఫాకు దక్షిణంగా ఉన్న బిన్యామినా పట్టణానికి సమీపంలో ఆదివారం ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. లెబనీస్ హెజ్‌బొల్లా గ్రూప్‌ ఇజ్రాయెల్ సైనిక శిబిరాన్ని డ్రోన్‌లతో టార్గెట్‌ చేసినట్ల తెలిపింది.అయితే ఈ దాడికి ముందు ఎటువంటి హెచ్చరిక సైరన్‌లు వినిపించకపోవటం గమనార్హం.

 

నిన్న(ఆదివారం) హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రయోగించిన యూఏఈ ఇజ్రాయెల్‌ ఆర్మీ స్థావరాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్‌) సైనికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాం. గాయపడిన వ్యక్తుల పేర్లను వ్యాప్తి చేయటం. పుకార్లు సృష్టించటం మానుకొని సైనికులు కుటుంబాలను గౌరవించాలని కోరుతున్నాం’అని ఇజ్రాయెల్‌ ఆర్మీ ‘ఎక్స్‌’లో పేర్కొంది.

హెజ్‌బొల్లా ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఇజ్రాయెల్ త్స్నోబార్ లాజిస్టిక్స్ స్థావరాన్ని కూడా క్షిపణలుతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఇక.. హెజ్‌బొల్లా డ్రోన్ దాడుల నుంచి రక్షణను బలోపేతం చేయటంలో సహాయపడటానికి ఇజ్రాయెల్‌కు కొత్త వైమానిక రక్షణ వ్యవస్థను పంపనున్నట్లు అమెరికా ప్రకటించిన ఈ డ్రోన్‌ దాడులు జరగటం గమనార్హం.

చదవండి: ఆ రిపోర్ట్‌లో నిజం లేదు: ఇరాన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)