అఫ్గాన్‌లోమంచు తుపాన్ బీభత్సం.. 61మంది మృతి

Published on Sat, 01/24/2026 - 21:07

అఫ్గానిస్థాన్‌లో మంచుతుపాన్‌, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గత మూడు రోజులలో దాదాపు 61 మంది మృతిచెందినట్లు అక్కడి విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా పలు ప్రాంతాలలో తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొంది.

తుఫాన్ బీభత్సంతో మధ్య, తూర్పు అఫ్గానిస్థాన్‌లో భారీ మరణాలు సంభవించినట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దాదాపుగా 61మంది ప్రాణాలు కోల్పోగా 110 మందికి పైగా గాయపడ్డట్లు పేర్కొంది. భారీ వానల దాటికి కాందహర్ ప్రావిన్సులోని ఒక ఇంటి పైకప్పు కూలడంతో ఆరుగురు చిన్నారులు మృతిచెందినట్లు తెలిపింది. అంతేకాకుండా మంచు కురవడంతో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకోవడంతో మృతులు మరింతగా పెరిగినట్లు పేర్కొంది.

అఫ్గాన్‌ ప్రధాన రోడ్డు మార్గాలలో ఒకటైన సలాంగ్ జాతీయ రహదారి వానల దాటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉజ్బెనిస్థాన్ నుంచి అఫ్గాన్‌కు విద్యుత్‌ను సరఫరా అయ్యే విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్ దెబ్బతినడంతో 12 ప్రావన్సులలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపింది. తుఫాన్ దాటికి రహదారులు దెబ్బతినడంతో టెక్నికల్ సిబ్బంది సమాయానికి అక్కడికి చేరుకోలేక పోయారన్నారు.

అకాల వర్షాలకు పెద్దమెుత్తంలో పంటనష్టం ఏర్పడిందని అక్కడి వార్త కథనాలు పేర్కొన్నాయి. అఫ్గాన్‌లో నాలుగు కోట్లకు పైగా మానవతా సహాయం కోరుతున్నారని యునేటైడ్ స్టేట్స్ నివేదిక ఇదివరకే ప్రకటించింది. కాగా ఇప్పుడు ఈ అకాల వరదలు ఆదేశాన్ని మరింత పేదరికంలో నెట్టాయి. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)