Breaking News

అఫ్గానిస్తాన్‌లో వర్ష బీభత్సం.. 35 మంది మృతి

Published on Wed, 07/17/2024 - 09:44

అఫ్గానిస్తాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో కురిసిన భారీ వర్షాలకు వివిధ దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో 35 మంది మృతి చెందారని తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు.

వర్షాల కారణంగా నంగర్‌హార్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ‍ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ సెడిఖుల్లా ఖురేషి మీడియాకు తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని, సుర్ఖ్ రోడ్ జిల్లాలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారని ఖురేషీ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారన్నారు.

భారీవర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. భారీ ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. నంగర్‌హార్‌లోని ప్రాంతీయ ఆసుపత్రి అధిపతి అమీనుల్లా షరీఫ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 207 మంది  బాధితులు వివిధ ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చారన్నారు. కాగా గత మే 10, 11 తేదీల్లో దేశంలో కురిసిన భారీ వర్షాలకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)