Breaking News

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం

Published on Sat, 10/14/2023 - 13:06

జెరూసలేం: ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే  హమాస్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఒకరిని  మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. నిన్న రాత్రి జరిగిన వైమానికి దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. 

హమాస్‌ వైమానిక విభాగానికి అధిపతిగా పనిచేసిన మురాద్ అబు మురాద్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్‌ వైమానిక కార్యకలాపాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ దళాలు  తెలిపాయి. ఇజ్రాయెల్‌లోకి గ్లైడర్‌ల పైనుంచి చొచ్చుకు వచ్చి దాడి చేసే హమాస్ దళాలకు మురాద్ అబు మురాద్‌ శిక్షణ ఇచ్చేవారని వెల్లడించాయి.

ఇదిలా ఉంటే... పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ పోరులో ఇరువర్గాలకు చెందిన సుమారు 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో 600 చిన్నారులతో 1,900 పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్‌ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృత్యువాతపడ్డారు.

ఇదీ చదవండి: 'భారత వాలంటీర్‌లతో ఇజ్రాయెల్‌కు మరో ఆర్మీ '

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)