Breaking News

ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం!

Published on Fri, 06/16/2023 - 12:06

వాషింగ్టన్‌: వైద్య పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలను అమ్ముకుంటున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. ఈ దారుణం అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లోని మార్చురీకి మేనేజర్‌గా పనిచేసిన సెడ్రిక్‌ లాడ్జ్‌ ఈ వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. అతను మృతదేహాలను ముక్కలుగా చేసి.. తల, మెదడు, చర్మం, ఎముకలను తస్కరించి, ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు తేలింది.

సెడ్రిక్ తన భార్య డెనిస్ (63)తో కలిసి  ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. మానవ అవశేషాలను కత్రినా మక్లీన్, జాషువా టేలర్, మాథ్యూ లాంపి వంటి వ్యక్తులకు విక్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అనుమానితులను జెరెమీ పాలీ, కాండస్ చాప్‌మన్ స్కాట్‌లుగా గుర్తించారు. నిందితులపై కుట్ర, దొంగిలించిన వస్తువులను అంతరాష్ట్ర రవాణా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కత్రినా మసాచుసెట్స్‌లోని పీబాడీలో కాట్స్ క్రీపీ క్రియేషన్స్ పేరుతో ఒక స్టోర్‌ని కలిగి ఉంది. దొంగిలించిన ఈ శరీర భాగాలను ఆమె ఆ దుకాణంలో విక్రయించినట్లు అధికారులు కనుగొన్నారు. 2018 నుంచి 2022 మధ్య ఈ వ్యవహారంలో లక్ష డాలర్ల వరకు లావాదేవీలు జరిగి ఉండవచ్చని సమాచారం. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ.. సెడ్రిక్‌ లాడ్జ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. గత నెలలోనే హార్వర్డ్‌ యాజమాన్యం సెడ్రిక్‌పై వేటు కూడా వేసింది.

చదవండి: అమెరికా గుడ్‌ న్యూస్‌: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)