ఇండియన్‌ డ్రైవర్‌ యూటర్న్‌.. ట్రంప్‌-కాలిఫోర్నియా గవర్నర్‌ మధ్య చిచ్చు

Published on Tue, 08/19/2025 - 08:59

కాలిఫోర్నియా: అమెరికాలో భారీ సెమీ – ట్రక్ నడుపుతున్న హర్జిందర్ సింగ్ అనే భారతీయుడు అక్రమంగా యూ-టర్న్ తీసుకుని, ముగ్గురి మృతికి కారకునిగా మారడం ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్‌- కాలిఫోర్నియా గవర్నర్‌ మధ్య  వివాదాలకు కారణంగా నిలిచింది. ఫ్లోరిడా టర్న్‌పైక్‌ పై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్జిందర్ సింగ్ అక్రమంగా యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక కారు ఆ ట్రక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
 

ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు ఈ ప్రమాదాన్ని సాధారణ రోడ్డు యాక్సిడెంట్  మాదిరిగా కాకుండా, హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ కేసుగా నమోదు చేశారు. అంటే చట్టవిరుద్ధ డ్రైవింగ్ కారణంగా ఇతరుల ప్రాణాలు పోయాయని భావిస్తూ డ్రైవర్ పై కేసు నమోదు చేయడం. కాగా అమెరికాలో అక్రమంగా 2018 నుంచి ఉంటున్న హర్జిందర్ సింగ్ కాలికాలిఫోర్నియా స్టేట్‌ నుంచి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అక్రమ వలసదారు హర్జిందర్ సింగ్ లైసెన్స్ ఎలా పొందాడనే ప్రశ్న  చర్చనీయాంశంగా మారింది. ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హైవే సేఫ్టీ అండ్ మోటార్ వెహికల్స్ డైరెక్టర్ డేవ్ కర్నర్ మాట్లాడుతూ.. హర్జిందర్ సింగ్ నేరపూరిత చర్యల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అతను ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు. చట్టాల ప్రకారం హత్య కేసును  ఎదుర్కోనున్నాడు. అలాగే ఇమిగ్రేషన్ ఉల్లంఘన కేసునూ ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.

భారతదేశానికి చెందిన హర్జిందర్ సింగ్‌ చట్టవిరుద్ధంగా దేశంలో  ఉంటునప్పటికీ కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ (డీఎంవీ) వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిందని  డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌)  ‘ఎక్స్‌’లో తెలియజేసింది. ఇందుకు కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్ న్యూసమ్ కారణమని ఆరోపించింది. అతను అమెరికన్ ప్రజల భద్రతతో ఆటలాడుకుంటున్నాడని పేర్కొంది. తమ సంస్థ ఇటువంటి నేరస్తులైన అక్రమ వలసదారులను అమెరికా నుండి బయటకు పంపేందుకు 24 గంటలూ పనిచేస్తున్నదని డీహెచ్‌ఎస్‌ పేర్కొంది.

అయితే దీనికి కౌంటర్‌గా గవర్నర్‌ న్యూసమ్‌ ప్రెస్‌ ఆఫీస్‌ హర్జిందర్ సింగ్‌ యూఎస్‌లోకి ప్రవేశించిన సమయంలో ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నారని పేర్కొంది. కాలిఫోర్నియా చట్టం ప్రకారం దేశంలో చట్టబద్ధమైన ఉనికి ఉన్నప్పుడే వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారని తెలిపింది. సింగ్ 2018 సెప్టెంబర్‌లో కాలిఫోర్నియా సరిహద్దును అక్రమంగా దాటారని, అప్పుడు బోర్డర్ పెట్రోల్ అరెస్టు చేసిందని వివరించింది. ఆ తర్వాత సింగ్‌ను ఫాస్ట్-ట్రాక్ డిపోర్టేషన్ కోసం ప్రాసెస్ చేశారని తెలిపింది. ఆ తర్వాత 2019, జనవరిలో నోటీసు టు అప్పీర్ ఇచ్చిన తర్వాత ఆయనను ఐదువేల అమెరికన్‌ డాలర్ల ఇమ్మిగ్రేషన్ బాండ్‌పై విడుదల చేశారని, అప్పటి నుండి  హర్జిందర్ సింగ్‌ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల్లోనే ఉన్నాడని న్యూసమ్‌ ప్రెస్‌  వివరించింది.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)