Breaking News

శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య

Published on Tue, 09/24/2024 - 17:14

కొలంబో: శ్రీలకం నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళశారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలో జరిగిన ఈ వేడుకలో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే.. నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పీపీ)కి చెందిన 54 ఏళ్ల హరిణితో చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎన్‌పీపీకి చెందిన మరో ఇద్దరు పార్లమెంట్‌ ఎంపీలు విజితా హెరాత్‌, లక్ష్మణ్‌ నిపునరాచ్చిని కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శ్రీలంకలో దిసనాయకే, హరిణితోసహా మొత్తం నలుగురి సభ్యులతో శ్రీలంక మంత్రివర్గం కొలువుదీరింది. ప్రధానితోపాటు ఆమెకు న్యాయం, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలకమైన మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. 

ఇదిలా ఉండగా ఎన్నికల తర్వాత అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలను ప్రస్తుతం హరిణి చేపట్టారు.  కాగా సిరిమావో బండారు నాయకే తర్వాత(2020 తర్వాత) ప్రధాని పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా హరిణి నిలిచారు.

హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ లెక్చరర్‌గా పనిచేసిన అమరసూర్య శ్రీలంకలో సామాజిక న్యాయం, విద్యకు గణనీయమైన కృషి చేశారు. ఆమె నియామకం రాజకీయాల్లో మహిళలకు పురోగతిని సూచించడమే కాకుండా ప్రగతిశీల నాయకత్వం, సంస్కరణపై ఎన్‌పీపీ  దృష్టిని నొక్కి చెబుతుంది. 

ఇక శ్రీలంకకు మూడో మహిళా ప్రధానిగా హరిణి చరిత్ర సృష్టించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన బండారునాయకే తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడుసార్లు(1960–65, 1970–77, 1994–2000) ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ఆ పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఖ్యాతికెక్కారు. ఆమె తర్వాత చంద్రికా కుమారతుంగ(1994) ప్రధాని పదవిలో రెండు నెలలు కొనసాగారు.

ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన విజయంతో శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని దిసనాయకే సోమవారం చెప్పడంతో శ్రీలంకలో ముందస్తు పార్లమెంటు ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)