Breaking News

ఆ మృతదేహం షిరి బిబాస్‌ది కాదు..

Published on Sat, 02/22/2025 - 05:50

టెల్‌అవీవ్‌: హమాస్‌ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మహిళ మృతదేహం.. 2023 అక్టోబర్‌ 7 దాడి సమయంలో పట్టుబడిన బందీలకు చెందినది కాదని ఇజ్రాయెల్‌ సైన్యం శుక్రవారం తెలిపింది. మృతదేహాల్లో ఖఫీర్‌ బిబాస్, అతని నాలుగేళ్ల సోదరుడు ఏరియల్‌ అనే ఇద్దరు పిల్లలున్నారని, మూడో మృతదేహం వారి తల్లి షిరి బిబాస్‌ది కాదని వెల్లడించింది. మహిళ మృతదేహం అపహరణకు గురైన ఇతర వ్యక్తులతో సరిపోలడం లేదని సైనిక ప్రతినిధి తెలిపారు. అంతేకాదు.. కఫీర్‌ బిబాస్, ఏరియల్‌ బిబాస్‌లను హమాస్‌ చంపిందని ఆరోపించారు. 

బందీల విడుదల ఒప్పందంలో హమాస్‌ది తీవ్రమైన ఉల్లంఘనని ఇజ్రాయెల్‌ మండిపడింది. షిరితో పాటు మిగిలిన బందీలందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్‌ సైన్యం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. అయితే, ఇజ్రాయెల్‌ ఆరోపణలపై హమాస్‌ ఇంకా స్పందించలేదు. కాగా, గురువారం మృతదేహాల అప్పగింత సమయంలో జరిగిన హడావుడిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. విడుదల సందర్భంగా వేలాది మంది జనం మధ్య.. సాయుధ హమాస్‌ ఫైటర్లు నాలుగు శవపేటికలను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ సహా అంతర్జాతీయ నేతలు తీవ్రంగా ఖండించారు. 
 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)