Breaking News

8 మంది బందీలను వదిలేసిన హమాస్‌

Published on Fri, 01/31/2025 - 04:33

ఖాన్‌ యూనిస్‌(గాజా స్ట్రిప్‌): హమాస్, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మరో అడుగు ముందుకేసింది. తమ అధీనంలో ఉన్న బందీల్లో ఎనిమిది మందిని హమాస్‌ సాయుధ సంస్థ గురువారం విడిచిపెట్టింది. ఇందులో ముగ్గురు ఇజ్రాయెలీలు, ఐదుగురు థాయిలాండ్‌ దేశస్తులున్నారు. 

తొలుత 20 ఏళ్ల ఇజ్రాయెల్‌ సైనికురాలు ఆగమ్‌ బెర్జర్‌ను జబాలియా పట్టణంలో వదిలేశారు. తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్బెల్‌ యేహూద్, గాడీ మోసెస్‌(80), థాయిలాండ్‌కు చెందిన పోంగ్‌సాక్‌ థయెన్నా, సథియాన్‌ సువన్నఖమ్, వాట్చారా శ్రీయావున్, బనావత్‌ సియాతవో, సురాసక్‌ లాంనాలను విడిచిపెట్టారు.

 బందీలంతా క్షేమంగా ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చేరుకున్నారని తర్వాత ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్, ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకటించాయి. ఇందుకు ప్రతిగా వెంటనే ఇజ్రాయెల్‌ సైతం తమ జైళ్లలో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న 110 మంది పాలస్తీనియన్లను విడుదలచేయబోయి అనూహ్య పరిస్థితుల్లో తమ నిర్ణయాన్ని వాయిదావేసుకుంది. 

తిట్ల దండకం, ఎగతాళి
తాము విడుదల చేసిన బందీలను హమాస్‌ సాయుధులు ఖాన్‌ యూనిస్‌ పట్టణంలోని హమాస్‌ ముఖ్యనేత దివంగత యాహ్యా సిన్వర్‌ ఇంటి సమీప హోస్టేజ్‌ స్క్వేర్‌లో రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులకు అప్పగించారు. అయితే ఈ అప్పగింత చూసేందుకు వేలాది మంది పాలస్తీనియన్లు వచ్చారు. పాలస్తీనియన్ల మధ్య నుంచి బందీలను క్షేమంగా తీసుకెళ్లడం రెడ్‌క్రాస్‌ ప్రతినిధులకు చాలా కష్టమైంది. బందీలను పాలస్తీనియన్లు ఇష్టమొచ్చినట్లు తిట్టడం, ఎగతాళిగా మాట్లాడటం కనిపించింది. 

వందలాది మంది పాలస్తీనియన్ల మధ్య నుంచి మహిళా బందీ ఆర్బెల్‌ యేహూద్‌ భయంభయంగా నడిచి వెళ్లిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. దీంతో విడుదలైన బందీల భద్రత ప్రమాదంలో పడిందని, ఈ నేపథ్యంలో జైళ్లలోని ఖైదీలను ఇప్పటికిప్పుడే వదిలేదిలేదని ఇజ్రాయెల్‌ స్పష్టంచేసింది. అప్పటికే జైళ్ల నుంచి ఖైదీలతో బయల్దేరిన వాహనాలను మళ్లీ జైళ్లలోకి రప్పించింది. దీంతో పాలస్తీనియన్ల విడుదల అర్ధంతరంగా ఆగింది. హమాస్‌ నుంచి విడుదలైన బందీలు క్షేమంగా తమ వద్దకు చేరుకున్నాకే ఖైదీలను వదిలేస్తామని ఇజ్రాయెల్‌ స్పష్టంచేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)