Breaking News

Halloween Day: ఈ దెయ్యాల ఉత్సవం దేనికి జరుపుతారో తెలుసా?

Published on Thu, 10/31/2024 - 11:00

హాలోవీన్ డే అంటే దెయ్యాల  ఉత్సవం. గతంలో ఈ పండుగ గురించి భారతీయులకు పెద్దగా తెలియదు. అయితే కాలానుగుణంగా ఈ విదేశీ పండుగ మనదేశంలోనూ అక్కడక్కడా జరుపుకుంటున్నారు.

ప్రతియేటా అక్టోబర్ 31న హాలోవీన్ డే జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాలో ప్రజలు దెయ్యాల వేషం వేసుకుని ఈ పండుగ చేసుకుంటారు. అతీంద్రియ శక్తులతో ఈ పండుగకు ముడిపెడతారు. ఈ హాలోవీన్ పండుగ  ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారిపోయింది. ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లోనే కాకుండా మరికొన్ని పట్టణాల్లో కూడా హాలోవీన్ పార్టీలు  నిర్వహిస్తున్నారు.

కొన్ని చోట్ల పాఠశాలల్లో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ హాలోవీన్ పండుగ వెనుక అనేక ఆసక్తికర అంశాలున్నాయి. ఈ పండుగకు  రెండు వేల సంవత్సరాలకు మించిన చరిత్ర ఉంది. ఈ ఉత్సవం ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, నార్తర్న్ ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో ప్రారంభమైనట్లు చెబుతారు. ఈ పండుగను సంహైన్ అని కూడా పిలుస్తారు.

సాధారణంగా సినిమాల్లో, సీరియల్స్‌లో హాలోవీన్‌ను పౌర్ణమి నాడు వచ్చినట్లు చూపిస్తారు. అయితే, హాలోవీన్ సమయంలో పౌర్ణమి చాలా అరుదుగా వస్తుంది.  2020లో పౌర్ణమి నాడు హాలోవీన్‌ వచ్చింది. తదుపరి హాలోవీన్ పౌర్ణమి రాత్రి కోసం చాలా సంవత్సరం వేచి ఉండాలి. హాలోవీన్ రోజున, పిల్లలు వివిధ రకాల దుస్తులు ధరించి సమీపంలోని ఇళ్లకు వెళతారు. క్యాండీలను పంచిపెడతారు.

ఈ ఆచారం ప్రారంభమైన నాటి రోజుల్లో రాత్రి సమయంలో దెయ్యాలు భూమిపై సంచరిస్తాయని నమ్మేవారు. ఈ కారణంగా ప్రజలు ఇళ్ల వెలుపల ఆహారాన్ని ఉంచడం మొదలుపెట్టారు. దీని తరువాత, చర్చిలలో ప్రార్థన చేసే అలవాటు ప్రారంభమైంది. క్రమంగా పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఈ  పండుగను ఉత్సాహంగా జరుపుకోవడం ప్రారంభించారు.

హాలోవీన్ రోజున నలుపు ,నారింజ రంగులతో అలంకరించుకుంటారు. నారింజ రంగు శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ రంగు శరదృతువును సూచిస్తుంది. నలుపు రంగు అనేది భయానికి, మరణానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శీతాకాలాన్ని సూచిస్తుంది. ఈ రెండు రంగులు రుతువులలో మార్పులు, జీవితం ,మరణాన్ని సూచిస్తాయి. 

ఇది కూడా చదవండి:  పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే..
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)