Breaking News

కమలా హారీస్‌ ఆఫీసుపై కాల్పులు

Published on Wed, 09/25/2024 - 08:36

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష రేసులో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారీస్‌ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. 

వివరాల ప్రకారం.. అరిజోనాలోని కమలా హరీస్‌ ఎన్నికల ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగినట్టు పోలీసులు ధృవీకరించారు. రాత్రిపూట ఆఫీసులో ఎవరూ లేని సమయంలో ఫైరింగ్‌ జరిగినట్టు తెలిపారు. కాల్పుల కారణంగా భవనంలో కిటికీలు, ఫర్నీచర్‌ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగుల కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డిటెక్టివ్‌ టీమ్స్‌.. కాల్పులు ఎవరూ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

మరోవైపు.. కాల్పుల ఘటన నేపథ్యంలో డెమోక్రటిక్‌ ఆఫీసు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అదనంగా పోలీసుల బలగాలను ఏర్పాటు చేశారు. కమలా ఆఫీసుపై కాల్పుల ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కూడా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్‌ గాయపడ్డారు. 

ఇది కూడా చదవండి: పేజర్‌ దాడులు నిజంగా ఇజ్రాయెల్‌ పనేనా?

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)