Breaking News

5 లక్షల కోట్ల టన్నుల  మంచు కరిగింది 

Published on Tue, 04/01/2025 - 05:42

అపారమైన మంచు నిల్వలకు గ్రీన్‌లాండ్‌ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్‌లాండ్‌లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట! 

గ్రీన్‌లాండ్‌పై గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదని నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఓఏఏ) తెలిపింది. ‘‘మొత్తమ్మీద ధ్రువాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’’అని ఆందోళన వెలిబుచి్చంది. అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది.

 అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ‘‘ఆవిరయ్యే నీటిలో ఎంతోకొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలావరకు మాత్రం గ్రీన్‌లాండ్‌ జలవ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం’’అని అధ్యయనానికి సారథ్యం వహించిన కెవిన్‌ రోజి్మయారెక్‌ వివరించారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)