Breaking News

రక్త పరీక్ష 1.. గుర్తించగల క్యాన్సర్లు 50 

Published on Sun, 10/19/2025 - 04:42

వాషింగ్టన్‌: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత వినే ఉంటారు. ఇక్కడ ఒకే ఒక రక్త పరీక్షకు ఒకటికాదు రెండు కాదు ఏకంగా 50 రకాల క్యాన్సర్‌లను గుర్తించవచ్చు. పలు రకాల క్యాన్సర్‌లకు తొలి దశలో ఎలాంటి లక్షణాలు బయటకు కనబడవు. అలాంటి క్యాన్సర్‌ ముదరబోతోందనే హెచ్చరిక సంకేతాన్ని సైతం ఈ రక్తపరీక్ష అందివ్వగలదు. 

ఉత్తరఅమెరికాలో ఇటీవల జరిపిన సంబంధిత ప్రయోగం విజయవంతమవడంతో బహుళ వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షకు బాటలుపడ్డాయి. ఈ 50 క్యాన్సర్‌లలో దాదాపు మూడు వంతుల క్యాన్సర్‌లకు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు లేవు. కానీ ఈ బ్లడ్‌టెస్ట్‌తో వాటి ఆనవాళ్లను సైతం ముందే కనిపెట్టవచ్చు. సగం క్యాన్సర్‌లను తొలిదశలోనే గుర్తింవచ్చు. దీంతో వాటికి వీలైనంత త్వరగా చికిత్స మొదలెట్టి వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు. 

అమెరికాకు చెందిన ‘గ్రెయిల్‌’ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ ఈ బ్లడ్‌ టెస్ట్‌కు ‘గ్యాలెరీ’అని పేరుపెట్టింది. క్యాన్సర్‌ కణితి నుంచి ముక్కలై విడివడి మానవ రక్తప్రవాహంలో చక్కర్లు కొడుతున్న డీఎన్‌ఏ అవశేషాలను ఈ రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఈ డీఎన్‌ఏ అవశేషాలు ఏ అవయవం నుంచి వస్తుందనేది కూడా ఈ బ్లడ్‌టెస్ట్‌ ద్వారా తెలుస్తుంది. 

బ్రిటన్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) ద్వారా సేకరించిన వేలాది మంది పౌరుల రక్తనమూనాలను పరిశీలించి ఈ బ్లడ్‌టెస్ట్‌ సామర్థ్యాన్ని గణించారు. అమెరికా, కెనడాల్లో 25,000 మంది యుక్తవయసు వాళ్ల రక్తాన్ని సైతం సేకరించి నూతన తరహాలో రక్త పరీక్ష చేశారు. వీరిలో ప్రతి 100 మందిలో దాదాపు ఒక శాతం మంది క్యాన్సర్‌బారిన పడబోతున్నట్లు తేలింది. వీరిలో తర్వాతి కాలంలో 62 శాతం మందికి క్యాన్సర్‌ లక్షణాల బయటపడటం విశేషం. 

‘‘క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో ఇదొక మైలురాయి. ముదరక ముందే క్యాన్సర్‌ను కనిపెట్టడంతో దానికి చికిత్స చేయడం అత్యంత సులభమవుతుంది. చికిత్సలో విజయశాతాలు అద్భుతంగా ఉంటాయి’’అని అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రంలోని ఒరెగాన్‌ హెల్త్, సైన్స్‌ యూనివర్సిటీలో రేడియేషన్‌ మెడిసిన్‌ విభాగ శాస్త్రవేత్త డాక్టర్‌ నిమా నబాబిజదేహ్‌ చెప్పారు. ‘‘క్యాన్సర్‌ ఉండకపోవచ్చు అని దాదాపు 99 శాతం మందిలో సాధారణ రక్తపరీక్షల్లో ‘నెగెటివ్‌’అని రాగా, అది తప్పు అని మా రక్తపరీక్ష నిరూపించింది’’ అని వివరించారు.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)