Breaking News

ఏఐ చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దు

Published on Wed, 11/19/2025 - 04:57

లండన్‌: ప్రపంచమంతా కృత్రిమమేధ మంత్రం జపిస్తున్న వేళ జనాలను జాగృతంచేస్తూ గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సుందర్‌ పిచాయ్‌ హితబోధ చేశారు. అపార డేటాను విశ్లేషించి సమాధానం ఇచ్చినంతమాత్రాన కృత్రిమమేధ చెప్పే ప్రతి అంశాన్ని గుడ్డిగా నమ్మొద్దని సుందర్‌ హెచ్చరించారు. బ్రిటన్‌కు చెందిన బీబీసీ వార్తసంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘కృత్రిమమేధ  వ్యవస్థలు సైతం తప్పులు చేస్తాయి. తప్పుడు సమాధానాలు అందించే ఆస్కారముంది. అందుకే వినియోగదారులు పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా ఇతరత్రా ప్రత్యామ్నాయాల్లోనూ సమాచా రాన్ని వెతకాలి. సమాచారాన్ని పోల్చిచూసుకోవాలి. మా కచ్చితత్వంపై నమ్మకంతో వినియోగదారులు గూగుల్‌ సెర్చ్‌ను ఆశ్రయిస్తున్నారు.

అయితే దీంతోపాటు గూగుల్‌ మరెన్నో ఉత్పత్తులను అందిస్తోంది. అయితే మీరేదైనా సృజనాత్మకంగా రచించాలనుకుంటే అందుకోసం ఇతరత్రా టూల్స్‌ కూడా ఉన్నాయి. కేవలం ఒక్క ఏఐ మీదనే గుడ్డిగా ఆధారపడొద్దు’’ అని అన్నారు. మే నెలలో గూగుల్‌ ఏఐ మోడ్‌లో సొంతంగా జెమిని చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. ‘‘వీలైనంత వరకు అత్యంత కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ మేరకే జెమిని చాట్‌బాట్‌ను సృష్టించాం. అయినాసరే ఇందులోనూ తప్పులు దొర్లేవీలుంది. అందుకే కేవలం ఒక్క ఏఐ సాంకేతికతనే గుడ్డిగా అనుసరించడం తగదు’’ అని అన్నారు.

ఏఐ రంగంలోని పెట్టుబడుల వరదపారుతోంది. ఇది కొంతకాలంలో స్తబ్దుగా మారి ఏఐ బుడగ పేలుతుందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘ ఏఐ రంగంలో పెట్టుబడులపై ప్రతి కంపెనీ అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే మార్పు అనేది సహజం. ఒకవేళ ఏఐ బబుల్‌ అనేది పేలితే దాని ప్రభావం ప్రతి కంపెనీపై ఉంటుంది. ఇందులో గూగుల్‌కు ఎలాంటి మినహాయింపు లేదు’’ అని సుందర్‌ పిచాయ్‌  అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)