Breaking News

ట్రాన్స్‌జెండర్‌తో మార్కెటింగ్‌... గూగుల్‌ క్రిస్మస్‌ ప్రకటనపై వివాదం

Published on Mon, 12/16/2024 - 05:41

మహిళల సంబంధ వస్తువులకు సంబంధించిన ప్రకటనను ట్రాన్స్‌జెండర్‌తో రూపొందించాలన్న టెక్‌ దిగ్గజం గూగుల్‌ ‘వినూత్న’ ఐడియా బెడిసికొట్టింది. దానిపై మహిళాలోకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. క్రిస్మస్‌ వేళ ఇలాంటి యాడ్‌ ఎందుకు తెచ్చారంటూ దుమ్మెత్తిపోశారు. అందమైన మహిళలే లేనట్టు ట్రాన్స్‌జెండర్‌తో యాడ్‌ చేస్తారా అంటూ నెటిజన్లు కూడా గూగుల్‌పై మండిపడుతున్నారు. 

క్రిస్మస్‌ సందర్భంగా గూగుల్‌ తన సొంత షాపింగ్‌ వేదిక ‘గూగుల్‌ షాపింగ్‌’లో మహిళల ఉత్పత్తులను ప్రమోషన్‌కు ఒక యాడ్‌ సిద్ధం చేసింది. టిక్‌టాక్‌లో పేరొందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్‌ క్రియేటర్‌ 30 ఏళ్ల సైరస్‌ వెస్సీని ప్రచారకర్తగా ఎంచుకుంది. చంపేసే చలిలో అత్యంత నాణ్యమైన మేకప్, చర్మ సంబంధ ఉపకరణాలు, దుస్తులను తక్కువ ధరకే కొనుక్కోండంటూ వెస్సీతో ఒక యాడ్‌ డిజైన్‌ చేసి ఆన్‌లైన్‌ ప్రసారాలు మొదలెట్టారు.

 కానీ అందులో ట్రాన్స్‌జెండర్‌ నటించడంతో ఆదరణ దేవుడెరుగు, విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘ఇది దారుణమైన అజెండాతో రూపొందించిన యాడ్‌. అమ్మాయిలను అవమానించాలని చేసినట్టుగా ఉంది’’ అంటూ పలు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్న బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత ఓలీ లండన్‌ అన్నారు. దాంతో, మహిళలను కించపరచాలనే దురుద్దేశమేదీ లేదంటూ గూగుల్‌ వివరణ ఇచి్చంది. సోషల్‌ మీడియాలో పేరొందిన ‘విభిన్న’ వ్యక్తులతో యాడ్‌ చేద్దామనే ఉద్దేశంతోనే అలా రూపొందించినట్టు చెప్పుకొచ్చింది.     

– వాషింగ్టన్‌  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)