Breaking News

కన్నీటి గాథ: నొప్పి భరించలేకపోతున్నా! కాలు తీసేయండి మహా ‍ప్రభో!

Published on Mon, 07/03/2023 - 13:06

టైలా పేజ్‌ అనే యువతి తన దీనగాథను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. బాధను భరించలేక తన కాలును తీసేయండంటూ వైద్యులను పలు విధాల ప్రాధేయపడిన ఉదంతాన్ని ఆమె షేర్‌ చేసింది. ఆమెకు భరించలేనంతగా కాలి నొప్పిరావడంతో దానిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

రీజనల్‌ పెయిన్‌ సిండ్రోమ్‌ బారిన ఫుట్‌బాల్‌ కోచ్‌.. 
న్యూయార్క్‌ పోస్ట్‌లో వెలువడిన ఒక రిపోర్టు ప్రకారం బ్రిటన్‌కు చెందిన టైలా పేజ్‌కు అపెండిక్స్‌ తొలగించినప్పటి నుంచి కాలి నొప్పిని ఎదుర్కొంటోంది. అంతకుమందు ఆమె ఫుట్‌బాల్‌ కోచ్‌గా పనిచేసింది. ఆమెకు కాలినొప్పి ఎంతగా ఉండేందంటే ఆ నొప్పితో ఆమె నిరంతరం ఏడుస్తూనే ఉండేది. నొప్పిని భరించలేకపోతున్నానంటూ కనిపించిన అందరితోనూ చెప్పుకుని రోదించేది. 

కాలు త్రీవంగా ప్రభావితం
టైలా 2016లో కాంప్లెక్స్‌ రీజనల్‌ పెయిన్‌ సిండ్రోమ్‌ బారిన పడింది. ఈ సమయంలో ఆమె భరించలేనంత నొప్పిని అనుభవించింది. ఈ వ్యాధి సాధారణంగా కాలు లేదా చేయిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ కుంగదీస్తుంది. దీనిని ‘సూసైడ్‌ డీసీజ్‌’ అని కూడా అంటారు. ఈ నొప్పి సాధారణంగా ఏదైనా గాయం అయిన తర్వాత, సర్జరీ లేదా స్ట్రోక్, గుండెపోటు వచ్చిన తరువాత మొదలవుతుంది.ఈ నొప్పి కారణంగా టైలా ఏ పనీ చేయలేకపోయేది. 

‘కాలి నొప్పి భరించడం అసాధ్యంగా మారింది’
తన అనుభవాన్ని వివరించిన ఆమె.. ‘ఒకానొక సమయంలో కాలును కదపడం కష్టంగా మారింది. విపరీతంగా నొప్పి వచ్చేది. చల్లని గాలి తాకినా, కాలు నీటిలో పెట్టినా భరించలేనంత నొప్పి పుట్టేది. కుర్చీలో కూర్చోలేకపోయేదానిని. స్కూలులో కొద్దిసేపు ఉండి వచ్చేసేదానిని’ అని తెలిపింది. భరించలేని నొప్పి కారణంగా ఆమె స్నానం చేయలేకపోయేది. దుస్తులు స్వయంగా ధరించలేకపోయేది. మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడటంతో మానసికంగా కుంగిపోయింది. 

తల్లి ఓదార్పుతో..
ఆ సమయంలో ఆమె తల్లి తన కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ఒకనాడు టైలా ఇక తాను ఆ కాలుతో జీవించలేనని అభిప్రాయపడింది. తన శరీరం నుంచి ఆ కాలిని తొలగించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. ‘చేతులు ఎత్తి వేడుకుంటున్నాను.. నా కాలు తీసేయండి’.. అని వైద్యులను శతవిధాల వేడుకుంది. 2019లో ఆమెకు ఆపరేషన్‌చేసి, కాలిని తొలగించారు. అప్పుడామె ఎంతో సంతోషించింది. ఇకపై భరించలేనంత నొప్పి ఎదుర్కోవాల్సిన అవసరం లేదని సంబరపడింది. 
ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్‌ లీ జిమ్‌ వర్క్‌అవుట్‌ ప్లాన్‌..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)