Breaking News

జనాలపైకి దూసుకెళ్లిన వ్యాన్.. ఒకరు మృతి, 16 మందికి గాయాలు

Published on Sun, 07/26/2026 - 07:33

బెర్లిన్‌: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌జీబీటీక్యూ+ (LGBTQ+) వర్గాల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్టోఫర్ స్ట్రీట్ డే (ప్రైడ్) వేడుకల్లో విషాదం అలముకుంది. వేడుకలు ముగిసే సమయాన ఓ తెల్లటి వ్యాన్ జనసమూహంపైకి దూసుకెళ్లడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

శనివారం రాత్రి బ్రాండెన్‌బర్గ్ గేట్ సమీపంలోని టియర్‌గార్టెన్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంతకుముందు లక్షలాది మందితో ప్రైడ్ పరేడ్ ఎంతో శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అయితే రాత్రి 10 గంటల ప్రాంతంలో వేడుకలు ముగిసే సమయంలో  విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ పార్కులోని గుమిగూడిన జనాల్ని ఢీకొని , చివరకు ఓ చెట్టును బలంగా తాకి ఆగిపోయింది.
 

సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సంఘటనా స్థలంలోనే వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ దుర్ఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బెర్లిన్ మేయర్ కై వెగ్నర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.

#

Tags : 1

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)