Breaking News

చక్రాల కుర్చీలో అంతరిక్ష యాత్ర 

Published on Sun, 12/21/2025 - 05:35

హూస్టన్‌: జర్మన్‌ ఏరోస్పేస్, మెకాట్రానిక్స్‌ ఇంజనీర్‌ మైఖేలా మిచీ బెంథాస్‌ చరిత్ర సృష్టించింది. ప్రమాదంలో గాయపడిన ఆమె చక్రాల కుర్చీలోనే అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తిచేసింది. అమెరికా కుబేరుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్‌ సంస్థ శనివారం ఉదయం న్యూ షెఫర్డ్‌ ఎన్‌ఎస్‌–37 సబ్‌ అర్బిటాల్‌ మిషన్‌ను నిర్వహించింది. అమెరికాలోని టెక్సాస్‌ నుంచి వ్యోమనౌకలో బెంథాస్‌తోపాటు మొత్తం ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు.

 భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో కాసేపు విహరించి, భూమికిపైకి క్షేమంగా తిరిగివచ్చారు. వీల్‌చైర్‌లో కూర్చొని అంతరిక్ష యాత్రలో పాల్గొనడం ఇదే మొదటిసారి. దివ్యాంగులు సైతం ఇలాంటి యాత్రలు చేయొచ్చని బెంథాస్‌ నిరూపించారు. ఆమె గతంలో మౌంటెన్‌ బైకింగ్‌ చేస్తుండగా గాయపడ్డారు. వెన్నుపూస దెబ్బతినడంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆయినప్పటికీ అంతరిక్షం పట్ల జిజ్ఞాస తగ్గలేదు. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నారు.  
 

Videos

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)