Breaking News

ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు!

Published on Sat, 12/13/2025 - 10:51

ఆకాశం.. ఓ అద్భుతం.. దానిలో కనిపించే దృశ్యాలు మహాద్భుతం.. ఇలాంటి అపురూప దృశ్యాలను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇందుకోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. 2025, డిసెంబర్ 13–14 రాత్రి జెమినిడ్స్ ఉల్కాపాతం  ఉతృష్ట స్థాయికి చేరి కనువిందు చేయనుంది. ఇది ఈ ఏడాదిలోకెల్లా అత్యంత అరుదైన దృశ్యంగా నిలిచిపోనుంది. నింగిని చీల్చుకుంటూ మెరుపులు వెదజల్లుతూ దూసుకుపోయే ఈ ‘షవర్’ను చూసేందుకు ఖగోళ ప్రేమికులతో పాటు ప్రపంచ ప్రజలంతా సిద్ధమవుతున్నారు.

14 తెల్లవారుజామున మ్యాజిక్
ఈ అద్భుతాన్ని పూర్తి స్థాయిలో చూడాలంటే, డిసెంబర్ 14న తెల్లవారుజాము 2 నుండి 4 గంటల మధ్య మేల్కొని ఉండాలి. ఇదే దీనిని వీక్షించేందుకు అత్యుత్తమ సమయం.ఈ కీలక సమయంలోనే మన భూమి ఉల్కా శిథిలాల మార్గంలోకి సంపూర్ణంగా ప్రవేశిస్తుంది.  ఆ సమయంలో ఈ ఉల్కలు వేగంగా కిరణాల్ల మాదిరిగా ఉద్భవించి, ఆకాశాన్ని మరింతగా ప్రకాశింపజేస్తాయి.

 ఇటువంటి స్థలంలో..
జెమినిడ్స్ అద్భుతాన్ని  కనులారా చూడాలంటే, కేవలం సమయం మాత్రమే కాదు.. స్థలం కూడా ముఖ్యం. చీకటిగా, స్పష్టంగా ఆకాశం కనిపించే ప్రదేశాన్ని ఎంచుకోండి. ఇందుకోసం నగరపు కాంతి కాలుష్యం లేని ప్రాంతానికి వెళ్లడం  ఉత్తమం. అర్ధరాత్రి దాటి, తెల్లవారుజాము వరకు గల సమయంలోనే ‘రేడియంట్’ (ఉల్కలు వచ్చే ప్రాంతం) హృద్యంగా కనిపిస్తుంది.

ఇంట్లో నుంచే విశ్వ విందు
క్షేత్ర స్థాయిలో ఈ అద్భుతాన్ని చూడలేని వారికి నిరాశ చెందనక్కర్లేదు. సాంకేతికత మనకు తోడుంది! ఇటలీలోని అబ్జర్వేటరీ నుండి వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ లాంటి సంస్థలు ఈ మెరుపుల ప్రదర్శనను రియల్‌టైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఫలింతంగా మీరు ఇంట్లో కూర్చునే ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచంలో ఎక్కడి నుండైనా వీక్షించవచ్చు.

2025లో అద్బుత జ్ఞాపకం
2025 చివరిలో కనిపించే ఈ జెమినిడ్స్ కేవలం ఒక సాధారణ ఖగోళ సంఘటన కాదు. ఇది విశ్వశక్తిని, అందాన్ని తెలియజేసే మరపురాని ప్రదర్శన. అందుకే రాత్రిపూట ఆకాశంలో జరిగే ఈ మెరుపుల వేడుకను చూడటానికి  సిద్ధమవ్వండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ అద్భుతమైన ఖగోళ విందు గురించి చెప్పి, వారితో కలిసి  ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించేందుకు ప్లాన్‌ చేసుకోండి.

ఇది కూడా చదవండి: ‘గోవా కలెక్టర్‌ ఫోన్‌ చేసి..’ బిగ్గరగా రోదించిన బాధితురాలు..

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)