Breaking News

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. స్పందించిన అమెరికా

Published on Tue, 03/18/2025 - 07:23

ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్‌) మరోసారి గాజాను లక్ష్యంగా చేసుకుంది. హమాస్ స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 200 మంది  మృతిచెందారు. ఇజ్రాయెల్- హమాస్(Israel-Hamas) మధ్య మొదటి దశ కాల్పుల విరమణ ముగిసిన సమయంలో.. రెండవ దశ చర్చలపై ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటారో అనే దానిపై సందేహాలు నెలకొన్న సమయంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది.   ఈ దాడులపై అమెరికా గట్టిగా స్పందించింది.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్ గాజాలోని దేర్ అల్-బలాలోని మూడు ఇళ్లు, గాజా నగరంలోని ఒక భవనం, ఖాన్ యూనిస్, రఫాలోని పలు ప్రదేశాలపై దాడి జరిగింది. జనవరిలో ప్రారంభమైన మూడు దశల కాల్పుల విరమణ(Three-phase ceasefire)ను ఎలా కొనసాగించాలనే దానిపై ఇజ్రాయెల్- హమాస్ మధ్య విభేదాలు నెలకొన్నాయి  ఈ నేపధ్యంలోనే హింస చెలరేగుతోంది. గత రెండు వారాలలో జరిగిన చర్చల్లో అమెరికా మద్దతు కలిగిన అరబ్ మధ్యవర్తులు  ఇరు పక్షాల మధ్య విభేదాలను పరిష్కరించలేకపోయారు.

ఇజ్రాయెల్ రెండవ దశ కాల్పుల విరమణకు వెళ్లే బదులు మొదటి దశ కాల్పుల విరమణ పొడిగింపుపై మొండిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండవ దశ కాల్పుల విరమణలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా నుండి పూర్తిగా వైదొలగవలసి ఉంటుంది. ఇజ్రాయెల్ దీనిని కోరుకోవడం లేదు. హమాస్.. గాజాను విడిచిపెట్టే వరకు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా విడిచిపెట్టకూడదని అనుకుంటోంది. ఇజ్రాయెల్ రెండవ దశ కాల్పుల విరమణతో ముందుకు సాగడానికి ముందే హమాస్ గాజాను విడిచిపెట్టాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. అందుకే రెండవ దశ కాల్పుల విరమణకు బదులుగా, ఇజ్రాయెల్ మొదటి దశ కాల్పుల విరమణను పొడిగించాలని కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హమాస్‌ మండిపడింది. తాజా దాడితో తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల ప్రాణాలను ప్రమాదంలోని నెట్టివేసిందని పేర్కొంది. 

మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై అమెరికా స్పందించింది. గాజాపై దాడికి సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చిందని తెలిపింది.  ఆ తరువాతనే దాడి చేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్‌తో సహా అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్‌కు ఇదొక హెచ్చరిక అని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్  పేర్కొన్నారు. గాజాను వదిలిపెట్టి వెళ్లాలని హమాస్‌ను ఇప్పుటికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన హమాస్.. ఫలితం అనుభవిస్తోందన్నారు. 

ఇది కూడా చదవండి: యెమెన్‌పై మరోమారు అమెరికా దాడి
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)