Breaking News

ఇజ్రాయెల్‌ ప్లాన్‌ సక్సెస్‌.. హమాస్‌కు కోలుకులేని ఎదురుదెబ్బ

Published on Fri, 01/03/2025 - 07:16

జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ నేతల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. తాజాగా పోలీస్‌ చీఫ్‌ టార్గెట్‌గా జరిగిన దాడుల్లో కీలక నేత సహ 68 మంది మృతి చెందారు. ఈ మేరకు వైమానిక దాడులను ఇజ్రాయెల్‌ సైతం ధృవీకరించింది.

గాజా సిటీపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 68 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో హమాస్‌ పోలీస్‌ చీఫ్‌ హసామ్‌ షాహ్వాన్‌తో పాటు.. మరో కీలక హమాస్‌ నేత మహమ్మద్‌ సలాహ్‌ కూడా ఉన్నారు. షాహ్వాన్‌ లక్ష్యంగా తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది. పోలీస్‌ చీఫ్‌ హసామ్‌ మృతి కారణంగా హమాస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కీలక నేతగా ఉన్నారు. తాజా దాడిలో మరణించిన వారిలో పౌరులే ఎక్కువ మంది ఉన్నారు.

అయితే, ఇజ్రాయెల్‌ పౌరులు ఆశ్రయం ఉంటున్న అల్-మవాసి జిల్లాను మానవతా జోన్‌గా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్‌ దళాలు దాడులు చేశాయి. ఈ కారణంగానే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, కొత్త ఏడాదిలో రెండు రోజులు ముగిసిన వెంటనే ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడింది.

ఇదిలా ఉండగా.. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధంలో 45,500 మందికి పైగా పాలస్తీనియన్లను మరణించారు. గాజాలోని 2.3 మిలియన్ల మంది ప్రజలు సిటీని విడిచివెళ్లిపోయారు. ఇదే సమయంలో హమాస్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 1,200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మరణించారు. మరో 251 మంది ఇజ్రాయెల్‌ పౌరులను గాజా వద్ద బంధీలుగా ఉన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)