Breaking News

14 మంది ఇజ్రాయెల్‌ జవాన్లు మృతి

Published on Mon, 12/25/2023 - 06:23

టెల్‌ అవీవ్‌:   హమాస్‌ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం, శనివారం హమాస్‌ మిలిటెంట్ల ఎదురుదాడిలో 14 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మరణించారు. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు బలైన ఇజ్రాయెల్‌ సైనికుల సంఖ్య 153కు చేరుకుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం ప్రకటించింది.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఒకేసారి 14 మంది జవాన్లను కోల్పోవడం ఇజ్రాయెల్‌ జీరి్ణంచుకోలేకపోతోంది. గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 166 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్‌ చెరలోని బందీలను విడిపించాలంటే యుద్ధం తప్పదని ఇజ్రాయెల్‌ అంటోంది.

హమాస్‌పై పోరాటం వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని, అయినప్పటికీ ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు చెప్పారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో జనం వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నెతన్యాహు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)