Breaking News

Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు

Published on Mon, 05/26/2025 - 08:05

గాజా: గాజాలో చోటుచేసుకున్న మరో విషాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రెండురోజుల ‍క్రితం గాజాపై ఇ‍జ్రాయెల్‌ జరిపిన సైనికదాడిలో తన తొమ్మిది మంది సంతానాన్ని  కోల్పోయిన వైద్యుడు ప్రస్తుతం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌(Intensive care)(ఐసీయూ) చికిత్స పొందుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు.

గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ అనే వైద్యుడు తన 10 మంది పిల్లలతో పాటు ఖాన్ యూనిస్‌లోని తన ఇంట్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చిన్నారులు మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన ఒక చిన్నారి  ప్రస్తుతం చికిత్స పొందుగున్నాడు. ఇదే దాడిలో గాయపడిన డాక్టర్‌ హమ్ది అల్-నజ్జర్ ప్రస్తుతం దక్షిణ గాజాలోని సమీపంలోని నాజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న అబ్దుల్ అజీజ్ అల్-ఫర్రా మాట్లాడుతూ డాక్టర్‌ నజ్జర్‌కు ఉదరం, ఛాతీలో అవుతున్న రక్తస్రావాన్ని నియంత్రించేందుకు రెండు ఆపరేషన్లు జరిగాయని, అతని తలకు కూడా తీవ్రగాయం అయ్యిదని తెలిపారు.

ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) శుక్రవారం ఖాన్ యూనిస్‌పై వైమానిక దాడి చేసినట్లు ధృవీకరించింది. తమ ఆపరేషన్ ప్రారంభించే ముందు సైన్యం ఆ ప్రాంతం నుండి పౌరులను తరలించిందని పేర్కొంది. కాగా నజ్జర్ భార్య కూడా వైద్యురాలు. అయితే ఆమె దాడి సమయంలో ఇంటిలో లేరు.  విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి చేరుకుని విగత జీవులుగా పడివున్న తన పిల్లలను చూసి షాకయ్యారు. తరువాత తేరుకున్న ఆమె యుద్ధంలో గాయపడిన పాలస్తీనియన్లకు  చికిత్స అందిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతం ఈ  యుద్ధం మొదలయ్యింది. తరువాత ఇజ్రాయెల్‌ హమాస్‌ను నిర్మూలించడం, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడమే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేస్తూ వస్తోంది. 

ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే..

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)