Breaking News

ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్?

Published on Thu, 09/21/2023 - 13:55

న్యూఢిల్లీ: కెనడాలో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్‌వార్‌లో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె ప్రత్యర్ధులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

మాదే బాధ్యత.. 
కెనడాలో జరిగిన ముఠా కాల్పుల్లో ఖలిస్థా ఉగ్రావది సుఖ దునెకె హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ హత్య తామే చేయించామని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్యాంగ్‌స్టర్‌లు గుర్‌లాల్ బ్రార్, విక్కీ ముద్దుకేరా హత్యలతో సుఖ దునెకెకు సంబంధముందని వాడు మాదకద్రవ్యాలకు బానిసాయి ఫేక్ వీసా మీద కెనడా పారిపోయాడని వాడు చేసిన తప్పులకు శిక్ష పడిందని మా శత్రువులు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బ్రతకరని హెచ్చరించారు.

 

లారెన్స్ పాత్రపై అనుమానాలు.. 
గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు ఆరోపణల్లో అహ్మదాబాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్‌వాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా పోస్టును బట్టి ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ హత్య జరగడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అక్కడి వారికి ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలు చేసి వీసా సేవలను నిలిపివేసింది.                   

చిలికి చిలికి.. 
భారత్ కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు బలహీనపడుతున్నాయి. ఖలిస్థాన్ ఉద్యమం పేరిట ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీగా నిర్వహించి వివాదానికి తెరతీశాయి. ఆనాడు భారత దేశం ఆ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసినా తేలిగ్గా తీసుకున్న కెనడా తర్వాత జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లు కారణమంటూ చేసిన వ్యాఖ్యలు తగువుకు ఆజ్యం పోశాయి. ఇంతలోనే మరో ఉగ్రవాది హత్య జరగడంతో కెనడా వీసాలను నిలిపివేసింది. 

ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి