Breaking News

రద్దీగా ఉన్న రోడ్డుపై ల్యాండైన విమానం

Published on Wed, 02/11/2026 - 04:32

గెయిన్స్‌విల్లె: వాహనాల రద్దీ తీవ్రంగా ఉన్న సమయంలో ఓ సింగిల్‌ ఇంజిన్‌ విమానం రోడ్డుపై అత్యవసరంగా ల్యాండయ్యింది. అంత ట్రాఫిక్‌లోనూ కేవలం మూడు కార్లకు మాత్రమే ఆ విమానం తాకింది. ఆ వాహనాల్లోని ఇద్దరు మాత్రమే, అదీ స్వల్పంగా గాయపడ్డారు. విమానంలోని వారు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకుంది. హాకర్‌ బీచ్‌క్రాఫ్ట్‌ రకానికి చెందిన సింగిల్‌ ఇంజిన్‌ విమానం అట్లాంటాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గెయిన్స్‌విల్లెలోని బ్రౌన్స్‌ బ్రిడ్జి రోడ్డుపై అకస్మాత్తుగా దిగింది. ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో తిరిగి వెనక్కి వెళ్లాలని మొదట భావించాం.

అయితే, ఎంత దూరం వరకు ఇంజిన్‌ సక్రమంగా పనిచేస్తుందో తెలియదు. దీంతో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కనిపించిన రోడ్డుపైనే ల్యాండవ్వాలని నిర్ణయం తీసుకున్నాం’అని పైలట్‌ థామస్‌ రోజెర్స్‌ చెప్పారు. ఘటనపై గెయిన్స్‌విల్లె పోలీస్‌ కెప్టెన్‌ కెవిన్‌ హోల్‌బ్రూక్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘రోడ్డుపై ఆ సమయంలో వందల సంఖ్యలో వాహనాలున్నాయి. అయినప్పటికీ వాటి మధ్యలో విమానం ల్యాండవ్వడం, కేవలం మూడు వాహనాలను మాత్రమే ఢీకొట్టి, విద్యుత్‌ తీగలను తాకకుండా క్షేమంగా దిగడం అసాధారణమైన విషయం’ అని పేర్కొన్నారు. ఈశాన్య జార్జియాలోని అతి ప్రధానమైన రహదారిపై జరిగిన ఇలాంటి ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవ డం, చనిపోకపోవడం చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది’ అని ఆయన చెప్పారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)