Breaking News

France PM Gabriel Attal: ఒక ‘గే’ ఫ్రాన్స్‌కు ప్రధానిగా ఎలా ఎదిగారు?

Published on Wed, 01/10/2024 - 09:24

ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియేల్ అటల్ నియమితులయ్యారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తమ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అటల్‌(35)ను తన కొత్త ప్రధానిగా నియమించారు. యుద్ధానంతర ఫ్రాన్స్‌కు గాబ్రియేల్ అటల్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు.

గాబ్రియేల్ అటల్‌కు ముందు లారెంట్ ఫాబియస్ తన 37 ఏళ్ల వయస్సులో అతి పిన్నవయసు ప్రధాని అయ్యారు. 1984లో ఫ్రాంకోయిస్ మిత్రాండ్ ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు. తాజాగా ఎలిజబెత్ బోర్న్ స్థానంలో గాబ్రియెల్ నియమితులయ్యారు.  గాబ్రియేల్ అటల్ బహిరంగంగా తాను స్వలింగ సంపర్కుడినని (గే) ప్రకటించుకున్నారు. 

గాబ్రియేల్ అటల్ 2018లో మాక్రాన్ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా ఉన్నప్పుడు చర్చల్లో నిలిచారు. ఆ సమయంలో అటల్.. మాక్రాన్ మాజీ రాజకీయ సలహాదారు స్టెఫాన్ సెజోర్న్‌తో సంబంధం  ఏర్పరుచుకున్నారు. గాబ్రియేల్ అటల్ మాజీ క్లాస్‌మేట్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కరోనా మహమ్మారి సమయంలో గాబ్రియేల్ అటల్ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేశారు. అప్పటి నుండి ఫ్రెంచ్ రాజకీయాల్లో కీలకనేతగా మారారు. ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు అటల్‌ ఆయనకు సలహాదారునిగా ఉన్నారు. అలాగే ఐదేళ్లపాటు ఆరోగ్య మంత్రికి సలహాదారుగానూ పనిచేశారు. దశాబ్ద కాలంలోనే ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవిని అందిపుచ్చుకున్నారు. అటల్ 2027 జూన్‌ 18న ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు

అటల్ 1989 మార్చి 16న పారిస్ సమీపంలోని క్లామార్ట్‌లో జన్మించారు. అటల్ ట్యునీషియా యూదు న్యాయవాది, చిత్రనిర్మాత వైవ్స్ అటల్ కుమారుడు. అటల్‌ తండ్రి 2015లో కన్నుమూశారు. అటల్‌ తన ముగ్గురు చెల్లెళ్లతోపాటు పారిస్‌లో పెరిగారు. అతని తల్లి మేరీ డి కోర్రిస్ ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పనిచేశారు.

అటల్ పారిస్‌లోని ఎకోల్ అల్సాసిన్ పాఠశాలలో చదువుకున్నారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక, ప్రతిష్టాత్మక సైన్సెస్ పో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం పబ్లిక్‌ అఫైర్స్‌లో పీజీ పట్టా పొందారు. అటల్‌ రాజకీయ జీవితం 2006లో సోషలిస్టు పార్టీలో చేరడంతో ప్రారంభమయ్యింది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)