Breaking News

12 నిమిషాల్లో సైకిల్‌పై ఈఫిల్‌ టవర్‌ ఎక్కి సరికొత్త రికార్దు

Published on Thu, 10/09/2025 - 19:01

ఫ్రెంచ్ సైక్లిస్ట్, టిక్‌టాక్‌ స్టార్‌ అరోలియాన్‌ ఫాంట్‌నోయ్‌ అరుదైన వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. మెట్ల మార్గం గుండా సైకిల్‌పై ఈఫిల్‌ టవర్‌ను 12 నిమిషాల్లో ఎక్కి  సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 686 మెట్లు ఉన్న ఈఫిల్‌ టవర్‌ను 12 నిమిషాల 30 సెకన్లలో సైకిల్‌పై ఎక్కారు, అది కూడా  ఎక్కడా కాలు కిందపెట్టకుండా ఈఫిల్‌ టవర్‌ను ఇలా ఎక్కడంతో వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. 

దాంతో 2002లో హ్యూగ్స్‌ రిచర్డ్‌ నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. గతంలో రిచర్డ్‌ 19 నిమిషాల వ్యవధిలో ఈఫిల్‌ టవర్‌ను సైకిల్‌పై ఎక్కితే.. ఇప్పుడు దాన్ని ఏడు నిమిషాలు ముందుగాను ఫాంట్‌నోయ్‌ చేరుకుని నూతన అధ్యాయాన్ని లిఖించాడు. తన తదుపరి లక్ష్యం దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బూర్జ్‌ ఖలీఫాను ఎక్కి రికార్డు నెలకొల్పడేనని పేర్కొన్నాడు.

అయితే ఈఫిల్‌ టవర్‌ను ఎక్కి రికార్డు నెలకొల్పడంపై ఫాంట్‌నోయ్‌ మాట్లాడుతూ.. ‘ ఇది మూడు-నాలుగేళ్ల క్రితమే చేయాలనుకున్నానని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో  వేచి చూడక తప్పలేదన్నాడు. ఒకవైపు కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని కలవర పెట్టడం, మరొకవైపు ఈఫిల్‌ టవర్‌ పనులు జరుగుతూ ఉండటం, మరొకవైపు ఒలింపిక్స్‌ గేమ్స్‌ వీటన్ని కారణంగా సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదన్నాడు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)