Breaking News

అమెరికా రాయబారి చార్లెస్‌ కుష్నర్‌కు ఫ్రాన్స్‌ సమన్లు 

Published on Tue, 08/26/2025 - 05:28

ఫ్రాన్స్‌: అమెరికా రాయబారి చార్లెస్‌ కుష్నర్‌కు ఫ్రాన్స్‌ సమన్లు జారీ చేసింది. యూదు వ్యతిరేకత పెరుగుదలను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలను విదేశాంగ శాఖ తోసి పుచ్చింది. కుష్నర్‌ వ్యాఖ్యలు ఆమోదయోగం కాదని పేర్కొంది. రాయబారులు తమ దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోమని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ తండ్రి చార్లెస్‌ కుష్నర్‌ను ప్రాన్స్‌ రాయబారిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌కు బహిరంగ లేఖ రాశారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్‌లో యూదుల పట్ల ద్వేషం పెల్లుబుకిందని కుష్నర్‌ ఆరోపించారు. 

ఇజ్రాయెల్‌పై తన విమర్శలను తగ్గించుకోవాలని మాక్రాన్‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఫ్రాన్స్‌ వీధుల్లో యూదులపై దాడి జరగకుండా, యూదుల ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, యూదుల వ్యాపారాలు ధ్వంసం చేయకుండా ఒక్క రోజు కూడా లేదన్నారు. 

ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళికను రూపొందించాలని, అందుకు మాక్రాన్, ఇతర ఫ్రెంచ్‌ నాయకులతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కుష్నర్‌ లేఖ... పాలస్తీనాకు గుర్తింపునివ్వడం యూదు వ్యతిరేకతకు దోహదపడుతోందంటూ మాక్రాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలనే పునరుద్ఘాటించింది. కాగా, సెపె్టంబర్‌లో పాలస్తీనాను అధికారికంగా గుర్తించాలన్న యోచనలో ఫ్రాన్స్‌ ఉంది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)