Breaking News

ఫ్రాన్స్‌ స్కూళ్లలో ఫోన్లు స్విచ్ఛాఫ్‌

Published on Thu, 09/05/2024 - 05:59

పారిస్‌: సెల్‌ఫోన్‌.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్‌ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్‌ఫోన్‌ మారిన సెల్‌ఫోన్‌ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం నడుం కట్టింది. 

వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచి్చంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్‌ మిడిల్‌ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్‌ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. 

ఈ కార్యక్రమానికి ‘డిజిటల్‌ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మాక్రాన్‌ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్‌ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్‌ కమ్యూనికేషన్‌ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్‌ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్‌ చేయాలన్న నిబంధన లేదు.

 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)