Breaking News

నేపాల్‌ ఎన్నికల బరిలో నలుగురు మాజీ ప్రధానులు

Published on Thu, 01/22/2026 - 06:27

ఖట్మండూ: నేపాల్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో నలుగురు మాజీ ప్రధానులు నిలిచారు. జెన్‌–జీ తిరుగుబాటు తరువాత మార్చి 5న సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికలకు నామినేషన్‌ ప్రక్రియ మంగళవారం ముగిసింది. నలుగురు మాజీ ప్రధానులు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌–లెనినిస్ట్‌) అధ్యక్షుడు, పదవీచ్యుతుడైన ప్రధాన మంత్రి  కేపీ శర్మ ఓలి  ఝాపా–5 నుంచి, నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌ సెంటర్‌) మాజీ ప్రధాన మంత్రి పుష్పకమల్‌ దహల్‌ ’ప్రచండ’ రుకుమ్‌ ఈస్ట్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. నేపాలీ కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన మరో ఇద్దరు మాజీ ప్రధానులు మాధవ్‌ కుమార్, ప్రగతిశీల లోకతాంత్రిక్‌ పార్టీకి చెందిన బాబురామ్‌ భట్టరాయ్‌ రౌతహత్‌–1, గూర్ఖా–2 నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు.  ఓలికి 74 ఏళ్లు, ప్రచండ, భట్టారాయ్‌లకు 71 ఏళ్లు, మాధవ్‌ కుమార్‌కు 72 ఏళ్లు. 

వీరే కాదు, దేశవ్యాప్తంగా ముగ్గురు మేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి పదవులకు రాజీనామా చేశారు. ఈ ముగ్గురిలో ప్రముఖుడు, ప్రజాదరణ పొందిన నాయకుడు ఖట్మండూ మెట్రోపాలిటన్‌ సిటీ మాజీ మేయర్‌ బాలేంద్ర షా. ఈయన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా ఝాపా–5 నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఆయనకు రాజకీయంగా మంచి పేరు ఉంది. ఖాట్మండూ మహానగరానికి మేయర్‌ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన బాలేంద్రను జనం ‘బాలెన్‌ షా’ అని పిలుచుకుంటారు. జెన్‌–జీ  హింసాత్మక నిరసనల నేపథ్యంలో సెప్టెంబర్‌ 9న ఓలి.. ప్రధానమంత్రి పదవికి రాజీ నామా చేశారు. దీంతో నేపాల్‌లో సార్వ త్రిక ఎన్నికలు అనివార్యమయ్యాయి. నేపాల్‌ ప్రతినిధుల సభలో 275 సీట్లుండగా.. అందులో 165 సీట్లకు ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. 110 సీట్లకు దామాషా పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ 165 సీట్ల కోసం 3,500 మందికి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. వీరిలో 400 మంది మహిళా అభ్యర్థులు. ఇక, ఈ ఎన్నికల్లో సుమారు 1.9కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.  

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)