Breaking News

ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ మాజీ స్పీకర్‌ హత్య 

Published on Sun, 08/31/2025 - 05:31

కీవ్‌: ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ మాజీ స్పీకర్‌ ఆండ్రీ పరుబియ్‌ గుర్తు తెలియని దుండగుడి కాల్పుల్లో మృతి చెందారు. నగరంలోని ఫ్రాంకివ్‌స్కీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. ఆండ్రీ పరుబియ్‌ హత్యను దారుణ ఘటనగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు. హంతకుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు వెంటనే రంగంలోకి దిగాయన్నారు. 

2013–14 మధ్య జరిగిన యూరో మైదాన్‌ ప్రజా ఉద్యమంలో ఆండ్రీ పరుబియ్‌ కీలకంగా వ్యవహరించారు. ప్రజా ఉద్యమాల వల్లే అప్పటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు యనుకోవిచ్‌ దేశం విడిచి పారిపోవడం, క్రిమియాను రష్యా ఆక్రమించుకోవడంతోపాటు రష్యా సరిహద్దు ప్రాంతాల్లో అంతర్యుద్ధం మొదలయ్యాయి. 

రష్యా మళ్లీ తీవ్ర దాడులు 
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ దాడులకు పాల్పడింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఏకంగా 537 డ్రోన్లు, 45 వరకు క్షిపణులను ప్రయోగించింది. జపొరిఝియా ప్రాంతంపై జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా పలువురు చిన్నారులు సహా డజన్ల కొద్దీ పౌరులు గాయాలపాలయ్యారని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)