Breaking News

బొల్సొనారోకు 27 ఏళ్ల జైలు 

Published on Fri, 09/12/2025 - 07:00

బ్రెసీలియా: బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారోకు ఆ దేశ సుప్రీంకోర్టు 27 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించింది. 2022లో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్వహించిన జాతీయ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, దేశంలో సైనిక తిరుగుబాటుకు కుట్ర చేశారని, ఎన్నికల్లో తనపై గెలిచిన అధ్యక్ష అభ్యర్థిని చంపేందుకు ప్రయత్నించారని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు కుట్ర చేశారని బొల్సొనారోపై మోపిన అభియోగాల్లో ఆయనను సుప్రీంకోర్టు శుక్రవారం దోషిగా తేలి్చంది. 

అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు జడ్జీలు బొల్సొనారోను దోషిగా తీర్పు చెప్పగా, ఒకరు ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. జైలు శిక్షతోపాటు బొల్సొనారో 2060 సంవత్సరం వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేయరాదని కోర్టు నిషేధం విధించింది. అంటే ఆయన శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా మరో 8 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీచేయటానికి అవకాశం ఉండదు. 2022 నాటి ఎన్నికల్లో బొల్సొనారోపై వామపక్ష కూటమి అభ్యరి్థ, ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లూలా డసిల్వా విజయం సాధించారు. 

ఆ ఎన్నికల ఫలితాలను ఒప్పుకునేందుకు బొల్సొనారో తిరస్కరించటంతో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2023 జనవరి 8న బొల్సొనారో మద్దతుదారులు దేశవ్యాప్తంగా హింసాత్మక దాడులకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బొల్సొనారోపై దర్యాప్తు చేపట్టింది. కొద్దిరోజుల క్రితమే ఆయన దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. తనపై మోపిన అభియోగాలను బొల్సొనారో తిరస్కరించారు. 

తాను ఎలాంటి తప్పులు చేయలేదని ప్రకటించారు. తన తండ్రిపై మోపిన కేసులు రాజకీయ ప్రతీకారంలో భాగమని బొల్సొనారో చిన్నకుమారుడు, బ్రెజిల్‌ సెనేటర్‌ ఫ్లావియో బొల్సొనారో ఆరోపించారు. కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని బొల్సొనారో తరఫు న్యాయవాదులు తెలిపారు. కాగా, బొల్సొనారోకు జైలు శిక్ష విధించటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖండించారు. కోర్టు తీర్పు అన్యాయమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. దీనిపై అమెరికా తగిన విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు. బ్రెజిల్‌పై అమెరికా ఇప్పటికే 50 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే.    

 

 

 

 

 

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)