Breaking News

అమ్మాయిల కొరత.. దొడ్డిదారి పడుతున్న చైనా యువత

Published on Mon, 05/26/2025 - 11:05

పెళ్లికి యువతుల కొరతతో చైనాలో యువకులు దొడ్డిదారి పడుతున్నారు. అక్రమ మార్గంలో వధువులను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి సంబంధాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

ఢాకా/బీజింగ్‌: సరిహద్దు అవతల నుంచి అమ్మాయిలతో వివాహాలను గుర్తించిన అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని చైనా యువతకు సూచిస్తున్నారు. ఇలాంటి వివాహాలు చట్టప్రకారం చెల్లవని, పైగా మానవ అక్రమ రవాణా(Human Trafficking)  కింద తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన ముప్పు కూడా వాటిల్లే అవకాశం ఉండడంతో ఇలాంటి స్కామ్‌లకు దూరంగా ఉండాలంటోంది. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్‌ మ్యాట్రిమోనీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. 

చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌(Global Times) కథనం ప్రకారం.. అక్కడి షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో క్రాస్‌-బార్డర్‌ డేటింగ్‌ వ్యవహారం నడుస్తోంది. తద్వారా వధువులను చైనా యువకులను ఎంచుకుంటున్నారని తేలింది. అయితే బయటి దేశాల నుంచి భార్యలను తెచ్చుకోవాలనుకునే ప్రయత్నాలు(foreign wife) మంచివికావని, మరీ ముఖ్యమంగా బంగ్లాదేశీ యువతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆ అడ్వైజరీ సూచించింది. బంగ్లాదేశ్‌ చట్టాల ప్రకారం.. యువతలు అక్రమ రవాణాను తీవ్ర నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తారు.  

ఇదిలా ఉంటే చైనాలో వధువ కొరత అక్కడి యువతను వెంటాడుతోంది. అందుకు అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. ఓ అంచనా ప్రకారం.. మూడు కోట్ల మందికి అమ్మాయిలే దొరకడం లేదట. మరోవైపు.. వివాహాల పేరుతో బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను చైనాకు కొన్ని ముఠాలు అక్రమ రవాణా చేస్తూ వ్యభిచార కూపంలోకి దించుతున్నాయి. ఈ పరిణామాలను తీవ్రంగా భావించిన అక్కడి ప్రభుత్వం.. వాటిని కట్టడి చేయడానికి చర్యలకు ఉపక్రమించింది.

మరోవైపు.. గతంలో బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు కూడా ఇదే తరహాలో అమ్మాయిల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ నడించింది. 2021లో టిక్‌టాక్‌ ద్వారా బాధితులకు గాలం వేసి వ్యభిచారంలోకి లాగిన 11 మందితో కూడిన ముఠాను ఢాకా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)