Breaking News

Forbes Billionaires 2023: నూతన కుబేరుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌

Published on Mon, 01/29/2024 - 05:52

పారిస్‌: ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు. ఎలాన్‌ మస్క్‌ స్థానంలో ఆర్నాల్ట్‌ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్‌ కంపెనీ రియల్‌ టైం బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలాన్‌ మస్క్‌ ఆస్తుల విలువ శుక్రవారం 204.5 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోగా, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఆస్తుల విలువ ఏకంగా 23.6 బిలియన్‌ డాలర్లు పెరిగి 207.8 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్‌ వివరించింది.

ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ గురువారం ఒక్కసారిగా 13 శాతం తగ్గడంతో ఆ మేరకు మస్క్‌ ఆస్తిలో 18 మిలియన్‌ డాలర్ల మేర కోతపడింది. అదే సమయంలో, ఎల్‌వీఎంహెచ్‌ షేర్ల విలువ శుక్రవారం 13 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా ఆ కంపెనీ మార్కెట్‌ విలువ 388.8 మిలియన్‌ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్‌ తెలిపింది. బెర్నార్డ్‌కు ఎల్‌వీఎంహెచ్‌తోపాటు లూయిస్‌ విట్టన్, ట్యాగ్‌ హ్యుయెర్, డామ్‌ ప్రిగ్నోన్, టిఫ్ఫనీ అండ్‌ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. 500 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన ఏకైక యూరప్‌ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్‌లో ఎల్‌వీఎంహెచ్‌ గుర్తింపు పొందింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)