Breaking News

గాల్లో తేలిపోతూ..కార్‌లో ఎగిరిపోతూ..

Published on Mon, 05/20/2024 - 03:58

ఫుల్లు ట్రాఫిక్‌.. ఐదారు కిలోమీటర్లు వెళ్లాలన్నా అరగంట పట్టేస్తోంది.. హాయిగా గాల్లో ఎగిరెళితే బాగుండు అనిపిస్తుంటుంది కదా..నిజంగానే అలా ఉన్నచోటు నుంచి గాల్లో ఎగిరెళ్లిపోయే..ఫ్లయింగ్‌ కార్‌ రెడీ అయింది. దాని పేరు హెక్సా.

అమెరికాకు చెందిన ‘లిఫ్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ కార్పొరేషన్‌’ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. తాజాగా జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగిన ‘సుషి టెక్‌ టోక్యో–2024’ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శించారు. 

పది మీటర్ల ఎత్తులో తిప్పుతూ.. 
షోలో ఈ ఫ్లయింగ్‌ కార్‌ను కేవలం బొమ్మలా పెట్టడం కాదు.. గాల్లో తిప్పి మరీ చూపించారు. కారులో కూర్చున్న వ్యక్తి.. దాన్ని పది మీటర్ల ఎత్తులో అటూ ఇటూ తిప్పాడు. ఈ ‘హెక్సా’ ఫ్లయింగ్‌ కార్‌ వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు (మోటార్లు, రెక్కలు) బిగించారు. 

సెకన్లలోనే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేలా ఏర్పాట్లు చేశారు. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీలతో నడుస్తుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లగలదని కంపెనీ తెలిపింది. నేల మీదేకాదు.. నీటిలోనూ సురక్షితంగా ల్యాండ్‌ అవుతుందని పేర్కొంది. త్వరలోనే వీటిని అమ్మకానికి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఇంతకీ ధరెంతో తెలుసా.. రూ.4.12 కోట్లు మాత్రమే.

భవిష్యత్తు  ఫ్లయింగ్‌ కార్లదే.. 
కిక్కిరిసిపోయి, అడుగు కూడా కదలని ట్రాఫిక్‌ సమస్యతో అల్లాడుతున్న నగరాల్లో భవిష్యత్తులో ఇలాంటి ఫ్లైయింగ్‌ కార్లు దూసుకుపోవడం ఖాయమని సుషి టెక్‌ షోలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. అత్యవసరమైన మందులు, ఇతర సామగ్రి రవాణాకూ ఇవి అద్భుతంగా తోడ్పడతాయని చెప్పారు. ముఖ్యంగా ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు.. ఫ్లయింగ్‌ కార్లతో ఎంతో ప్రయోజనం ఉంటుందని టోక్యో గవర్నర్‌ యురికో కోయికే పేర్కొన్నారు.  

- సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ 

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం