Breaking News

ఒకరు ధర్మాసనంపై.. మరొకరు బోనులో... ఇద్దరు మిత్రుల కథ!

Published on Mon, 09/02/2024 - 05:59

అది 2015. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఆర్థర్‌ నథానియల్‌ బూత్‌ దొంగతనం ఆరోపణలపై అరెస్టయ్యాడు. మియామీ–డేడ్‌ జడ్జి మిండీ గ్లేజర్‌ ముందు విచారణకు హాజరయ్యాడు. అతన్ని తేరిపార చూసిన జడ్జి, నువ్వు నౌటిలస్‌ మిడిల్‌ స్కూల్‌లో చదివావు కదా ప్రశ్నించారు. దాంతో ఆమెను గుర్తు పట్టిన బూత్‌ ఒక్కసారిగా భావోద్వేగంతో రోదించాడు. వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు మరి! 

స్కూలు రోజుల్లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌. కలిసి ఫుట్‌ బాల్‌ ఆడేవాళ్లమని, బూత్‌ తమ స్కూళ్లోకెల్లా ఉత్తమ బాలుడని మిండీ గుర్తు చేసుకున్నారు. ‘బూత్, నిన్నిక్కడ చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై మంచి జీవితం గడుపుతాడని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ అలా జరగలేదు. బూత్‌ చోర జీవితమే కొనసాగిస్తూ వచ్చాడు.

 నగరమంతటా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్లంబర్‌ వేషంలో ఓ వృద్ధుడి ఇంట్లో దూరి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. వాటర్‌ ఇన్‌స్పెక్టర్‌గా నటించి ఓ ఇంట్లోంచి నగల పెట్టె దొంగిలించాడు. టైరు మారుస్తున్న మహిళ బంగారు గొలుసు లాక్కున్నాడు. ఇవన్నీ చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి కోర్టులో జడ్జిగా చిన్నప్పటి నేస్తం కని్పంచలేదు గానీ అతని అరెస్టుతో నాటి ఉదంతం మరోసారి తెరపైకి వచి్చంది. 2015 నాటి కోర్టు ప్రొసీడింగ్స్‌ వీడియో వైరల్‌గా మారింది.                    

– వాషింగ్టన్‌  

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు