Breaking News

ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!

Published on Wed, 09/18/2024 - 06:10

ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్‌ లిస్ట్‌ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్‌ లిస్ట్‌తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్‌లైన్‌లో తన క్లాస్‌మేట్‌లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .!  అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్‌స్టన్‌’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

 ‘క్రీక్‌ సైడ్‌ మిడిల్‌ స్కూల్‌లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్‌ సైడ్, సిల్వర్‌ శాండ్‌ మిడిల్‌ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్‌లైన్‌లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్‌ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్‌ మైక్‌ చిట్వూడ్‌ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్‌’లో షేర్‌ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)