Breaking News

నైట్‌ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు

Published on Sun, 04/23/2023 - 19:05

యూఎస్‌లోని ఓ నైట్‌ షోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా షోని నిలపేసి ప్రేక్షకులకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలిపింది నిర్వాహణ సంస్థ. ఈ ఘటన కాలిపోర్నియాలోని చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్‌లో జరిగిన నైట్‌ షోలో ఈ అ‍గ్నిప్రమాదం సంభవించింది. దీంతో టామ్‌ సాయర్‌ ద్వీపం సమీపంలోని థీమ్‌ పార్క్‌ వద్ద జరిగే ఫ్యాంటాస్మిక్‌ ప్రదర్శనను అకస్మాత్తుగా నిలిపేశారు. ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ ప్రేక్షకుల కోసం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది నిర్వాహక సంస్థ.

శనివారం సాయంత్రం డిస్నీల్యాండ్ పార్క్‌లో ఫ్యాంటాస్మిక్‌ చివరి ప్రదర్శన సమయంలో ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆకర్షణగా ఉండే 24 అడుగుల  జెయింట్‌ డ్రాగన్‌ మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ అనుహ్య ఘటనతో నిర్వాహకులు ప్రదర్శనను నిలిపేసి ప్రదర్శనలిచ్చే నటీనటులందర్నీ సురక్షిత ‍ప్రదేశాలకు తరలించారు. ఆ ద్వీపం అంతా హుటాహుటినా ఖాళీ చేయించారు.

ఐతే ఈ ఘటనలో ఎవరూ ఎలాంటి గాయాల బారిన పడలేదు కానీ ఎంతమేర అగ్నిప్రమాదం సంభవించింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా అక్కడ ‍ప్రదేశం అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.  ఈ  ఫ్యాంటాస్మిక్‌ అనేది 27 నిమిషాల ప్రత్యక్ష ప్రదర్శన. దీన్ని  1992 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాణసంచా, రంగురంగుల నీటి ప్రదర్శన  తోపాటు లైవ్‌లోన నటులు  పైరోటెక్నిక్‌లు, లేజర్‌లు, సంగీతం వంటి ప్రదర్శనలిస్తారు. 

(చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న వారిని ఆ మార్గంలో తరలించేందుకు సన్నాహాలు!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)