Breaking News

అమెరికాలో కొత్త వైరస్ కలకలం

Published on Sun, 11/16/2025 - 15:44

అమెరికాలో కొత్త రకం వైరస్ కలకలం రేపుతోంది. వాషింగ్టన్ కు చెందిన ఓవ్యక్తికి  బర్డ్ ప్లూ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి " హెచ్5 ఎన్5 ఏవియన్ ఇన్‌ప్లూయింజా" అనే కొత్తరకం వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇటువంటి వైరస్ మానవులలో సోకడం ఇది మెుదటిసారని డాక్టర్లు తెలిపారు.

వాషింగ్టన్ లోని ఓ వ్యక్తికి "ఎచ్5ఎన్5 ఏవియన్ ఇన్‌ప్లూయింజా" వైరస్ సోకడం ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. సాధారణంగా ఈ వైరస్ మనుషులకు అంటుకోదని కానీ ఈ వ్యక్తికి ఎలా సోకిందనే విషయాలను అధ్యయనం చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. బాధితుడు బహుశా కోళ్ల ద్వారనే వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు.అయితే ఈ వైరస్ సోకిన వ్యక్తి వృద్ధుడని అతనికి ఇతర ఆరోగ్యసమస్యలున్నాయని డాక్టర్లు తెలిపారు.

 సాధారణంగా ఇన్‌ప్లూయింజా వైరస్ జంతువులలోనే వ్యాపిస్తుందని ఈ వైరస్ సోకిన జంతువుల లాలాజలం, మలపదార్థాలు, పాడి పశువుల పాల ద్వార వేరే ప్రాణులకు సోకే అవకాశం ఉందని తెలిపారు. ఇది ఒకప్రాణి నుంచి మరోప్రాణికి సోకే అవకాశం శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నామని వారికి కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్లు పేర్కొన్నారు.

‍అమెరికాలో బర్డ్ ప్లూ వైరస్ కేసు రావడం గడిచిన తొమ్మిది నెలల్లో ఇదే తొలిసారని అక్కడి వైద్యశాఖ ప్రకటించింది. ఈ వైరస్ మనుషులలలో అంత ప్రభావం చూపే అవకాశాలు లేవని  అయితే అలా అని దానిని తేలికగా తీసుకోకూడదని డాక్టర్లు తెలిపారు. బర్డ్ ప్లూ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త పాటించాలని ఆరోగ్యశాఖ తెలిపింది. కోళ్ల పరిశ్రమలలో విధులు నిర్వహించే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)