Breaking News

అబూదాబి హిందూ ఆలయంలో సామాన్య భక్తుల సందడి!

Published on Sat, 03/02/2024 - 07:59

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రాతితో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని సామాన్యుల కోసం తెరిచారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అబుదాబిలోని ఈ హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 

దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. అబుదాబిలోని ఈ తొలి హిందూ దేవాలయం నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ఇదే శైలిలో అయోధ్యలోని రామాలయాన్ని నిర్మించారు. అబూదాబి ఆలయ వాలంటీర్ ఉమేష్ రాజా తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 20 వేల టన్నులకు పైగా సున్నపురాళ్లను 700 కంటైనర్లలో అబుదాబికి తీసుకువచ్చారు. 

అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్‌)తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో.. ‘నిరీక్షణ ముగిసింది! అబుదాబి ఆలయం ఇప్పుడు సందర్శకులు , సామాన్య భక్తుల కోసం తెరిచారు. సోమవారం మినహా అన్ని రోజుల్లో ఈ ఆలయం ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని’ పేర్కొంది. 

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ‘ఆలయంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, ఈ ప్రాంగణాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి భక్తులు ఆలయ మార్గదర్శకాలను పాటించడం అవసరం’ అని పేర్కొన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)