Breaking News

హమాస్‌కు అరబ్‌ దేశాల గట్టి షాక్‌

Published on Thu, 07/31/2025 - 08:01

టెల్ అవీవ్: గాజాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న హమాస్‌కు అరబ్‌ దేశాల నుంచి గట్టి షాక్‌ తగిలింది. కొన్నాళ్లుగా గాజాపై హమాస్‌ సాగిస్తున్న దారుణ మారణకాండను అరబ్‌ దేశాలు ఖండిస్తూ, ఒక ప్రకటన విడుదల చేశాయి. దానిలో గాజా నుంచి హమాస్‌ తక్షణం వైదొలగాలని హెచ్చరించాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశానికి సహ అధ్యక్షత వహించిన ఫ్రాన్స్.. సౌదీ అరేబియా చేసిన ఈ ప్రకటనను స్వాగతించింది. దీనిని చారిత్రాత్మక ఘటనగా పేర్కొంది.

సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, జోర్డాన్‌తో సహా పలు అరబ్, ముస్లిం దేశాలు తాజాగా 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ఖండించాయి. గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్ సమూహం  దాని పాలనను ముగించాలని కోరాయి. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) సమావేశంలో అరబ్ లీగ్, యూరోపియన్ యూనియన్ (ఈయూ), 17 ఇతర దేశాలు ఒక ప్రకటన చేశాయి. హమాస్  తన చెరలో ఉంచిన బందీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ ప్రకటనలో అరబ్ దేశాలు,ముస్లిం దేశాలు సంయుక్తంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. పాలస్తీనా శరణార్థుల కోసం పాటుపడుతున్న యూఎన్‌ ఏజెన్సీలపై నిషేధాన్ని  ఎత్తివేయాలని ఇజ్రాయెల్ నేతలను కోరాయి. గాజాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విదేశీ దళాలను మోహరించాలని  అరబ్‌ నేతలు కోరారు. గాజాలో తలెత్తుతున్న ఆకలి చావులను  ఖండిస్తున్నామని అరబ్‌ దేశాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలనే అరబ్  ఉద్దేశ్యాన్ని ఈ ప్రకటన స్పష్టం చేస్తున్నదన్నారు. కాగా గాజాలో ఘర్షణలు ప్రారంభమై 21 నెలలు గడిచింది. ఈ ఘర్షణల్లో 1,200 మందికి పైగా జనం మృతి చెందారు. ఈ యుద్ధం గాజాలోని లక్షలాదిమందిని నిర్వాసితులను చేసిందని, ఈ ప్రాంతంలో మానవతా సంక్షోభానికి కారణంగా నిలిచిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)