Breaking News

కువైట్ జైలులో మంటలు.. ఓ పోలీసు మృతి

Published on Tue, 01/20/2026 - 00:50

కువైట్: కువైట్ సెంట్రల్ జైలులో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పోలీసు అధికారి మృతి చెందాడు. మృతుడిని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన కల్నల్ సౌద్ అల్-ఖమ్సన్‌గా గుర్తించారు.

భవనంలో ఫర్నిచర్, తివాచీల మారుస్తున్న సమయంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే జైలు సిబ్బంది, అగ్నిమాపక బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో కల్నల్ సౌద్ అల్-ఖమ్సన్ తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ఆరుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. భవనంలో భద్రతా ప్రమాణాలు, విద్యుత్ వ్యవస్థ నిర్వహణపై సమగ్ర దర్యాప్తు జరపనున్నారు. మృత పోలీసు అధికారికి ఉన్నతాధికారులు, సహచరులు సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)