Breaking News

బ్యాంకాక్‌ బార్‌లో అగ్నిప్రమాదం.. 27 మంది సజీవదహనం

Published on Tue, 07/14/2026 - 12:33

బ్యాంకాక్‌: థాయిలాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక బార్‌లో హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్పటివరకూ పార్టీలో ఎంజాయి చేస్తున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఈ ఘోర ప్రమాదంలో 27 మంది మరణించగా, 63 మంది గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అధికారులు భావిస్తున్నారు.

దీంతో వెంటనే వివరాలు తెలుసుకున్న అగ్మిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేయత్నం చేసింది. గాయపడ్డ వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే భవనంలో అధిక భాగం కాలిపోయిందని పేర్కొన్నారు.

అయితే ప్రమాదసమయంలో అక్కడే ఉన్న ఓ సంగీతకారుడు మాట్లాడుతూ" కరెంట్ పోవడానికి కొద్దిసేపటి ముందు, వేదిక దగ్గర ఉన్న సర్క్యూట్ బ్రేకర్ నుండి పొగ రావడం సంభవించింది.  ఆ వెంటనే పెద్ద పేలుడు సంభవించడంతో, పబ్ మొత్తం ఒక్కసారిగా పొగతో నిండిపోయింది. దీంతో చాలా మంది భవనం వెనుక ఉన్న మరుగుదొడ్డిలోకి పారిపోయారు. అక్కడ కొంతమంది అక్కడ ఊపిరాడక మరణించారు అని చెప్పారు.

అయితే పొగరావడం గమనించిన వెంటనే స్పందించిఉంటే ఇంత పెద్దఎత్తున ప్రాణనష్టం సంభివించి ఉండేది కాదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ప్రమాద ఘటన స్థలాన్ని థాయ్ ప్రధానమంత్రి అనుటిన్ చార్న్‌విరాకుల్ సంఘటనా స్థలాన్ని సందర్శించినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)