Breaking News

చైనా బొగ్గు గనిలో అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

Published on Mon, 09/25/2023 - 13:26

బీజింగ్: దక్షిణ చైనాలోని పాంఝౌ నగరం గుయిజౌ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గని యజమాని గుయిజౌ పంజియాంగ్ షాంఘై స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో కనీసం 16 మంది కార్మికులు మరణించారన్నారు.

పాంఝౌ నగర భద్రతాధికారుల ప్రాధమిక దర్యాప్తులో గుయిజో బొగ్గుగనిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ఎంత ప్రయత్నించినా అదుపు కాలేదని చాలాసేపు ప్రయత్నించగా చివరకు ఎలాగో మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. కన్వేయర్ బెల్టుకు మంటలు అంటుకోవడం వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని అక్కడున్నవారిలో కొందరు సురక్షితంగా బయటపడినా 16 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని మరణించారని తెలిపారు. పంజియాంగ్ కంపెనీకి మొత్తం 7 బొగ్గు గనులని నిర్వహిస్తోందని మొత్తంగా 17.3 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందని అన్నారు.      

అగ్నిప్రమాదం తర్వాత షాంఘైలోని కమొడిటీస్ కన్సల్టెన్సీ మిస్టీల్ ఒకరోజు పాటు పాంఝౌ నగరంలోని అన్ని బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గుయిజౌకు చెందిన బొగ్గుగని భద్రతా విభాగం సంఘటన గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపింది. మిస్టీల్ తెలిపిన వివరాలు ప్రకారం ప్రమాదం జరిగిన బొగ్గు గనిలో ఒక ఏడాదికి 52.5 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని ఇది చైనా మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఐదు శాతం అని తెలిపింది.        

ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు?

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)