Breaking News

పావురాలకు ఆహారమేస్తే జైలుకే..! ఎక్కడో తెలుసా?

Published on Thu, 01/15/2026 - 17:20

ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో జరిగిన అనూహ్య ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. అక్కడ రోడ్డుపై నడిచివెళుతున్న మహిళకు ప్రక్కనే పావురాల గుంపు కనిపించింది. వాటికి ఏదైనా తినిపించాలని అనిపించడంతో ఆహారం వేసింది. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో  ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.

ఇంగ్లాండ్‌.. లండన్‌లో పరిసరాల పరిశుభ్రతకు అక్కడి అధికారులు కఠిన చట్టాలు అవలంభిస్తున్నారు. ‍పాపం అది తెలియని ఓ మహిళ పక్షులకు ఆహారం తినిపించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బుధవారం లండన్‌లో ఓ మహిళ పావురాలకు ఆహారం వేసింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం రోడ్డుపై ఏదైనా పదార్థాలు వేయడం నేరం. దీంతో ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వేడుకోవడంతో 100 పౌండ్లు జరిమానా విధించి వదిలేశారు. 

ఈ చిత్రాలను అక్కడే ఉ‍న్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. అయితే లండన్‌లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త చెదారం వేయడం నేరం. అంతేకాకుండా పెద్ద సౌండ్లతో సౌండ్‌బాక్సుల వాడకం అనుమతి లేకుండా కరపత్రాలు పంచడం తదితరమైన పనులన్నీ అక్కడ నేరంగా పరిగణిస్తారు. వీటికి జైలుశిక్షతో పాటు జరిమానాలు విధిస్తారు. 

#

Tags : 1

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)